క్రైమ్/లీగల్

షైన్ డైరెక్టర్‌పై బెయిలబుల్ కేసా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: షైన్ ఆస్పత్రిలో చిన్నారి మృతికి బాధ్యులైన యాజమాన్యంపై పోలీసులు బెయిలబుల్ కేసును నమోదు చేయడంపై హైకోర్టు శనివారం నాడు మండిపడింది. అగ్ని ప్రమాదంలో చిన్నారి మృతితో పాటు మరో నలుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడిన ప్రమాదానికి నిర్లక్ష్యం కారణమంటూ ఎండీ సునీల్‌కుమార్ రెడ్డి, ఇతర సిబ్బందిని ఎల్బీనగర్ పోలీసులు శుక్రవారం నాడు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారిని శనివారం పోలీసులు హైకోర్టులో హాజరుపరిచారు. అయితే వారిపై నమోదు చేసిన కేసు, సెక్షన్లపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంత పెద్ద ప్రమాదానికి బాధ్యులైన వారిపై బెయిలబుల్ కేసులు ఎలా నమోదు చేశారని ప్రశ్నించారు. పోలీసులు 304 ఎ బెయిలబుల్ కేసుతో సరిపెట్టగా దానిని కోర్టు ఆదేశాల మేరకు 304 సెక్షన్ పార్టు 2గా మార్చి నిందితులను రిమాండ్‌కు తరలించారు. ప్రమాదం జరిగిన నాలుగో అంతస్తుకు అనుమతి లేదని, అగ్నిమాపక శాఖ నుండి ఎన్‌ఓసీ పొందలేదని కూడా పోలీసులు తమ ఎఫ్‌ఐఆర్‌లో
పేర్కొన్నారు. ఆస్పత్రి యాజమాన్యం, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని, షార్టు సర్క్యూట్ జరిగి ఫ్రిజ్ వద్ద పేలుడు జరిగి ఆ మంటలు నాలుగో అంతస్తుకు వ్యాపించాయని సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయింది. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న హెడ్‌నర్సు బయటకు వెళ్లడం, సిబ్బంది ఎవరూ లేకపోవడంతో చిన్నారులు మంటల్లో చిక్కుకున్నారని తేలింది. ఈ కేసులో ఎండీ సునీల్‌తో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.