క్రైమ్/లీగల్

పనె్నండేళ్ళ బాలికపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురజాల, ఏప్రిల్ 16: పనె్నండేళ్ల బాలికను మాయమాటలతో నమ్మించి అత్యాచారానికి పాల్పడిన దారుణం గుంటూరు జిల్లాలో జరిగింది. గురజాల మండలం జెంగమహేశ్వరపురం గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు అందింది. గురజాల అర్బన్ సీఐ వై రామారావు కథనం ప్రకారం.. జెంగమహేశ్వరపురం గ్రామంలో యానాది కాలనీకి చెందిన 12 ఏళ్ల బాలిక ఆరవ తరగతి వరకు చదివి పాఠశాల మానేసి కూలి పనులు చేసుకుంటోంది. అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కాటం ఆంజనేయులతో పరిచయమైంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి బాలికను పెళ్లి చేసుకుంటానని మాయమాటలతో నమ్మించి తన ఇంటి వెనుక ఉన్న జనసంచారం లేని ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. సోమవారం ఉదయం ఇంటికి తిరిగి వస్తున్న బాలిక నుండి విషయం తెలుసుకున్న తండ్రి ఫిర్యాదు చేయగా గురజాల డీఎస్‌పీ ప్రసాద్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామారావు తెలిపారు.