క్రైమ్/లీగల్

వరంగల్‌లో దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 16: వరంగల్ అర్బన్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఐదు సంవత్సరాల బాలికపై ఒకరు బిటెక్, మరొకరు పాలిటెక్నిక్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు లైంగిక దాడికి ఒడిగట్టారు. స్వయాన పెద్దనాన కూతురుపైనే ఇద్దరు సోదరులు ఐదుసంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపింది. సోమవారం ఇద్దరి బాలురులను వారి ఇంటివద్దే అదువులోకి తీసుకొని విచారించి, నిందితులు ఇద్దరు కూడా బాలురు కావడంతో వారిని జువైనల్ కోర్టులో హాజరు పర్చారు. బాధితురాలి తల్లి సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సోమవారం సీపీ రవీందర్ పోలీస్ కమిషనరేట్‌లో వివరాలు వెల్లడించారు. తల్లి కూతురుకు స్నానం చేయించే క్రమంలో మర్మావయవాల వద్ద నొప్పిగా ఉందని కూతురు అనడంతో పరిశీలించగా గాయా లు కన్పించడంతో ఆమె కూతుర్ని తీసుకొని డాక్టర్‌ను సంప్రదించగా, లైంగిక దాడి జరిగినట్లు తెలిపింది. కూతుర్ని అడగగా రెండు నెలల క్రితం తన బావ కొడుకులు తనపై అత్యా చారానికి పాల్పడినట్టు బాధితురాలు తెలిపింది. నిందితులపై పోస్కో యాక్టు ప్రకారం కేసు నమోదు చేయడంతో పాటు 374(2)(ఐ)(ఎన్), 327, సెక్షన్ 5(ఐ)6 ఆఫ్ ఫోస్కో యాక్టు 2012 చట్టం కింద కేసు నమోదు చేసినట్టు సీపీ వెల్లడించారు.