క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనకల్లు, ఏప్రిల్ 17: మండల పరిధిలోని కోటూరులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుళ్లాయప్ప కుమారుడు శివకుమార్ (12) అనే విద్యార్థి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు తిరుపతి, హిందూపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తిరుపతి నుండి హిందూపురంకు వెళ్తుండగా సైకిల్‌లో వెళ్తున్న విద్యార్థి శివకుమార్‌ను వెనుక వైపు నుండి ఢీకొంది. ఈ ప్రమాదంలో శివకుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన శివకుమార్‌ను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాగా 108 వాహనం త్వరగా రాకపోవడంతో ఎస్‌ఐ శ్రీనివాసులు తన వాహనంలోనే శివకుమార్‌ను చికిత్స కోసం తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. శివకుమార్ తనకల్లు ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.