క్రైమ్/లీగల్

ఉద్రిక్తతల మధ్య బాబు అంత్యక్రియలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, నవంబర్ 1: డ్రైవఠ్ బాబు మ‘రణమే’ ఆర్టీసీ కార్మిక సమస్యల నేపథ్యంలో ఆఖరిది కావాలని, కేసీఆర్ సర్కారు చర్చలకు దిగి రావాలని అప్పటి వరకు అంత్యక్రియలు జరిపేది లేదంటూ పెద్దఎత్తున కరీంనగర్‌లో నిరసనలు వ్యక్తం కావడం తీవ్ర ఉద్రిక్తతతకు దారితీసింది. మూడు రోజుల క్రితం ఆర్టీసీ జేఏసీ సమరభేరి సభలో డ్రైవర్ బాబు గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. బాబు భౌతికకాయానికి ఎంపీ బండి సంజయ్ కుమార్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ఆర్టీసీ జేఏసీ నేత థామస్‌రెడ్డి, రాజిరెడ్డి తదితరులు నివాళులు అర్పించి పెద్దఎత్తున నిరసన చేపట్టారు. గురువారమే మృతదేహం కరీంనగర్‌కు చేరుకున్నా దానికి అంత్య్రకియలు జరగకుండా అడ్డకున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం బాబు అంతిమయాత్ర తీవ్ర ఉద్రిక్తత మధ్య కొనసాగింది. పార్థీవదేహాన్ని నగర బస్టాండ్‌వైపు తీసుకెళ్లడానికి పోలీసుల అనుమతి నిరాకరించడంతో పోలీస్- ఆందోళనకారుల మధ్య తోపులాట జరగడంతో పోలీస్ లాఠీచార్జి చేశారు. ఈ క్రమంలో ఎంపీ సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీ్ధర్‌బాబు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ తదితరులు అడ్డుకోవడంతో ఆందోళనలు మరింత ఎగిసిపడ్డాయి. బాబు అంతిమయాత్రకు వచ్చిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో కడసారి చూపునకు నోచుకోలేకపోయామని పలువురు కన్నీళ్లు పెట్టుకున్నారు. బాబు ఇంటికి జనం భారీగా తరలిరావడంతో అడుగడుగునా పోలీసుల నిఘా నియంత్రణ చేశారు. రోప్ పార్టీలు, బారికేడ్లు పెట్టి అంతిమ యాత్రను వ్యూహాత్మకంగా శ్మశానం వైపు దారి మళ్లించి, బాబు పార్థీవదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. 28 రోజులుగా ఆర్టీసీ సమ్మె చేసినా, మూడు రోజులుగా బాబు మృతదేహంతో దీక్ష చేస్తున్నా సీఎం కేసీఆర్‌లో చలనం లేదని నేతలంతా మండిపడ్డారు. ఆర్టీసీ సమ్మెకు యావత్ తెలంగాణ సమాజం, ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు మద్దతు ప్రకటించినా సీఎం కేసీఆర్‌లో ఎలాంటి మార్పు రాలేదని దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఖరి వల్లే కార్మికులంతా ఆవేదనకు లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, మానసికంగా చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవర్ బాబు కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం, డబుల్ బెడ్ రూం ఇల్లు, ఇంటిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని,ఆత్మవిశ్వాసంతో హక్కులు సాధించుకుందాం అని పిలుపునిచ్చారు. కేసీఆర్ రజాకార్ల పాలనను తలపిస్తున్నారని, శాంతి యుతంగా సాగుతున్న యాత్రను నిర్బంధంగా అదుపు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో హఠాన్మరణం చెందిన బాబు మృతదేహం వద్ద బైఠాయించి సీఎం చర్చలు పెడితేనే కదిలిస్తామంటూ శుక్రవారం సాయంత్రం వరకు పట్టుబట్టినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మృతదేహాన్ని ఎక్కువ రోజులు ఉంచడం ఇబ్బంది దృష్ట్యా విధిలేక అఖిలపక్షాలు, ఆర్టీసీ జేఏసీ నాయకులు కుటుంబ సభ్యులను సముదాయించి దహనం కోసం శ్మశానవాటికకు కన్నీటి వీడ్కోలు మధ్య మృతదేహాన్ని తరలించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోగా అంతిమయాత్రకు అనుమతి లేదని అడ్డుకొని అరెస్టులు కొనసాగించారు. వ్యూహాత్మకంగా అంతిమయాత్రను శ్మశానం వైపుమళ్లించారు.ప్రభుత్వం తీరుపై ఎంపీ సంజయ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణమాదిగ, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండ రాం, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ్ధర్ బాబు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీపీసీసీ వర్కింగ్‌ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ జేఏసీ నేతలు థామస్ రెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల హోరు, నినాదాల జోరు, ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలతో కరీం‘నగరం’ అట్టుడుకింది.