క్రైమ్/లీగల్

విశాఖ ఘటనపై విచారణాధికారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), అక్టోబర్ 1: విశాఖ జిల్లా మధురవాడ సబ్‌రిజిస్ట్రార్ కార్యలయంలో తనిఖీల వ్యవహారంలో ఏసీబీ అధికారుల మీద వచ్చిన ఆరోపణలపై విచారణ చేస్తున్నామని అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ కుమార్ విశ్వజిత్ తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారులపై వచ్చిన ఫిర్యాదులపై జాయింట్ డైరెక్టర్ మోహన్‌రావును విచారణాధికారిగా నియమించినట్లు చెప్పారు. ఆయన ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలుంటాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన ఉండాలనేది ముఖ్యమంత్రి అభిమతమన్నారు.
ఈ విషయంలో ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ఉన్నారని తెలిపారు. అవినీతి నిరోధక శాఖలో రాష్టవ్య్రాప్తంగా జరుగుతున్న విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా విజయవాడలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న డీజీ విశ్వజిత్ ఈసందర్భంగా విద్యార్థులు, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఇదే సమయంలో ఆయన విశాఖ ఘటనకు సంబంధించి ఏసీబీ అధికారులపై వచ్చిన ఆరోపణలపై కూడా స్పందించారు. విశాఖ ఘటనపై మంత్రి బోస్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడేందుకు నిరాకరించిన ఆయన అవినీతి ఆరోపణలు వచ్చిన అధికారులపై విచారణాధికారి ఇచ్చే నివేదిక అధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. వాస్తవాల ఆధారంగా ఏసీబీ అధికారులపై చర్యలకు ఏ మాత్రం వెనుకాడబోమని స్పష్టం చేశారు. లంచం తీసుకోవడం మాత్రమే కాదు.. లంచం ఇవ్వడం కూడా అవినీతే అన్నారు. అవినీతి అధికారులను ప్రోత్సహించడం మంచి పద్ధతి కాదని, ఈ రోజుల్లో చాలా మంది తమ పనులు త్వరితగతిన అయిపోవాలని లంచాలు ఇచ్చేందుకు వెనుకాడటం లేదన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడైతే లంచాలు ఇవ్వడం మానుకుంటారో అప్పుడు అవినీతి అంతం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ డైరెక్టర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి, ముఖ్య న్యాయ సలహాదారు ఎం వెంగయ్య ఇతర అధికారులు పెద్ద ఎత్తున విద్యార్ధులు పాల్గొన్నారు.