క్రైమ్/లీగల్

నీటమునిగి విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామిడి, ఏప్రిల్ 17 : చేపల వేట కెళ్లి ప్రమాదవశాత్తు వాగులో పడి విద్యార్థి షన్ముఖ దత్తారెడ్డి (17) మృతి చెందిన ఘటన మండల పరిదిలోని పొగురూరు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పొగురూరు గ్రామానికి చెందిన ప్రతాప్‌రెడ్డి, లింగేశ్వరి దంపతుల కుమారుడు షన్ముఖ దత్తారెడ్డి పామిడి విజ్ఞాన్ పాఠశాలలో పదో తరగతి చదువుకున్నాడు. ఈమధ్యకాలంలోనే పరీక్షలు పూర్తయ్యాయి. వేసవి సెలవులు కావడంతో షన్ముఖ దత్తారెడ్డి మిత్రులతో కలిసి చేపల వేటకు వెల్లి ప్రమాదవశాత్తు కాలుజారి వాగులో పడి పోయాడు. వెంటనే స్థానికులు బయటకు తీసీ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
వ్యక్తి అనుమానాస్పద వ్యక్తి
డీ.హీరేహాల్, ఏప్రిల్ 17 : మండల పరిధిలోని కళ్యం గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్‌పై 48 ఏళ్ల వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మంగళవారం మృతి చెందాడు. ఉదయం పొలాలకు రైతులు వెళుతున్న సమయంలో రైల్వే ట్రాక్‌పై పడి ఉన్న శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు ఉమేష్ ఎం.హనుమాపురం గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. ఉమేష్ తాగుడుకు బానిసై రోజూ భార్యతో గొడవపడేవాడని పోలీసులు తెలిపారు. ఈనేపథ్యంలో మూడు రోజుల క్రితం భార్యతో గోడవపడి ఇంటి నుండి బయటకు వచ్చాడని తెలిపారు. ఈ రోజు శవమై కనిపించాడని పోలీసులు చెబుతుండగా ఉమేష్ ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదని, ఈయనకు భూముల వివాదం కోర్టులో ఉండడం, ఇటీవల మొక్కజొన్నపంట 60వేల నగదు తీసుకుని బయటకు వచ్చాడని గ్రామస్థులు తెలిపారు. ఉమేష్‌ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి రైల్వే ట్రాక్‌పై పడేసి ఉంటారని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.