క్రైమ్/లీగల్

సిట్ ఆధ్వర్యంలో దరఖాస్తుల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 1: భూ కబ్జాల నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆధ్వర్యంలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం ఆరంభమైంది. విశాఖలోని వుడా చిల్డ్రన్ థియేటర్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు స్వీకరణ నిర్వహించారు. ఈ నెల 7 వరకు కొనసాగనుంది. సిట్ పరిధిలోకి వచ్చే వాటన్నింటినీ ఈ ఏడు రోజులుపాటు స్వీకరించాక 8,9 తేదీల్లో రాజకీయ పార్టీ నాయకులు, ప్రజలు, బాధితుల నుంచి వేర్వేరుగా సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ఆ తరువాత విచారణ ప్రారంభమవుతుంది. ప్రస్తుతానికి విశాఖపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వచ్చే 13 మండలాలకు సంబందించి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఇందులో భాగంగా తొలిరోజున సిట్ పరిధిలోకి రానివి 65 దరఖాస్తులు, పరిధిలోకి వచ్చేవి కేవలం 14 దరఖాస్తులు అందాయి. ఇందులో సగానికిపైగా సిట్ పరిధిలోకి రానివే ఉన్నట్టు కౌంటర్ల నిర్వాహకులు తెలిపారు. ప్రైవేటు స్థలాల వివాదాలు, టాంపరింగ్ జరగని ప్రభుత్వ భూములకు చెందినవి, ఎస్టేట్ ఇనాం తదితర క్యాటగిరీలవే వీటిలో ఎక్కువుగా ఉన్నట్టు స్పష్టమైంది. దీనిని దృష్టిలోపెట్టుకుని ప్రత్యేక కౌంటర్ల ద్వారానే కాకుండా సిట్ పరిధిలోకి రానీ వాటి కోసం ప్రత్యేక కౌంటర్లను రెండింటిని ఏర్పాటు చేశారు. బాధితులను నిరాశపర్చకుండా ఉండేందుకు, సిట్ పరిధిలోకి రాని వాటిని ప్రత్యేక కౌంటర్ల ద్వారా స్వీకరించారు. ఈ సందర్భంగా సిట్ లైజనింగ్ ఆఫీసర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పీ.శేషశైలజ మాట్లాడుతూ సిట్ నిర్దేశించినన 13 మండలాలకు సంబంధించి ఏడు అంశాలను పరిగణనలోకి తీసుకుని బాధితుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు. సిట్ పరిధిలోకి రాని వాటిని ప్రత్యేక కౌంటర్ల ద్వారా స్వీకరిస్తున్నామని, బాధితులు నిరాశకు గురికాకుండా ఉండేందుకు ఈ విధంగా చేస్తున్నామన్నారు. దరఖాస్తుల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన ప్రతి మండలానికి చెందిన కౌంటర్లతోపాటు బాధితులకు ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసుకుని తగిన విధంగా సహకారాన్ని పొందేందుకు వీలుగా ఆరు హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటయ్యాయన్నారు. స్వీకరించిన దరఖాస్తులకు రసీదులు ఇవ్వడం, వీటన్నింటినీ కంప్యూటరీకరించే కార్యక్రమాన్ని ఎప్పటికపుడు పూర్తిచేస్తున్నామన్నారు. బాధితుల నుంచి వచ్చే ఆదరణను దృష్టిలో పెట్టుకుని అవసరమైన మేరకు దరఖాస్తులు స్వీకరించే కౌంటర్లను పెంచుతామన్నారు. సిట్ సభ్యులు రిటైర్డ్ జడ్జి భాస్కరరావు, అనురాధ పర్యవేక్షణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా దరఖాస్తులు స్వీకరణ జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో పలు మండలాల నుంచి జమిందారీ, ఇనాం, గ్రామ కంఠాలు కబ్జాలకు గురయ్యాయని, ఏళ్ళ తరబడి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా కబ్జాదారుల చేతుల్లోనే తమ భూములు ఉండిపోయాయని పలువురు బాధితులు సిట్ ముందు ఆందోళన వ్యక్తంచేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన సిట్‌కూ ఇదే విధంగా ధరఖాస్తులు అందజేసామని, అయినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు.