క్రైమ్/లీగల్

‘నాగా చర్చల్లో’ పురోగతి: సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోహిమా, నవంబర్ 1: నాగాలాండ్‌ను దశాబ్దాలుగా పీడిస్తున్న తీవ్రవాద సమస్యను పరిష్కరించడానికి జరుపుతున్న చర్చల్లో పురోగతి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నెయిఫియు రియో తెలిపారు. ఇంకా చర్చలు ముగియాల్సి ఉందని, తరువాత భాగస్వాములందరితో సంప్రదింపులు జరిపిన తరువాత ఒప్పందం కుదుర్చుకోవడం జరుగుతుందని కేంద్రం ప్రకటించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చర్చలతో సానుకూల ఫలితం వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. నాగా తుది ఒప్పందం కుదిరిందని, త్వరలోనే ప్రకటిస్తారని పెద్ద ఎత్తున వదంతులు, తప్పుడు సమాచారం వ్యాప్తి చెందిందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. అస్సాం, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్‌లను సంప్రదించడం జరుగుతుందని, వాటి ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న తరువాతనే తుది ఒప్పందం కుదుర్చుకోవడం జరుగుతుందని కేంద్రం స్పష్టం చేసింది.