క్రైమ్/లీగల్

శ్రీనగర్‌లో ఆంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, నవంబర్ 1: శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ఆంక్షలు విధించారు. శుక్రవారం సామూహిక ప్రార్థనల తరువాత హింసాత్మక ప్రదర్శనలు జరుగుతాయనే భయంతో శాంతి భద్రతల నిర్వహణ కోసం ముందు జాగ్రత్త చర్యగా ఈ నిషేధాజ్ఞలు విధించారు. రాజ్యాంగంలోని అధికరణం 370ని రద్దు చేసిన తరువాత వరుసగా 89వ రోజు శుక్రవారం కూడా కాశ్మీర్‌లో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. ‘శాంతి భద్రతల నిర్వహణ కోసం పాత నగరంలోని అయిదు పోలీసు స్టేషన్ల పరిధిలో, సౌరా పోలీస్ స్టేషన్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించడం జరిగింది’ అని ఒక పోలీసు అధికారి తెలిపారు. పూర్వ జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించినందుకు నిరసనగా కాశ్మీర్‌లో హింసాత్మక ప్రదర్శనలు నిర్వహిస్తారనే భయంతో అధికారులు అనేక చోట్ల భారీగా భద్రతా బలగాలను మోహరించారు.