క్రైమ్/లీగల్

బెయిల్ ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో ముద్దాయిగా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం బుధవారం ఢిల్లీ హైకోర్టుకు హాజరై, తనకు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో దర్యాప్తు సంస్థలు సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇవన్నీ విచారణ ఏజన్సీ సిద్ధం చేసిన పత్రాలు కాబట్టి, వాటిని తాను తారుమారు చేస్తాననే వాదన సరైంది కాదని ఆయన స్పష్టం చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టుకు దాఖలు చేసిన చార్జిషీట్ మొత్తం అధికారికంగానే ఉంటుందని న్యాయమూర్తి సురేష్ ఖైత్‌కు చిదంబరం చెప్పారు. చిదంబరం తరఫున వాదించిన సీనియర్ అడ్వకేట్, కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబాల్ తన వాదనను వినిపిస్తూ విచారణ సంస్థలు దాఖలు చేసిన సాక్ష్యాధారాలను చిదంబరం ఏవిధంగా తారుమారు చేస్తారని ప్రశ్నించారు. ఈడీ తరఫున కోర్టుకు హాజరైన అడ్వకేట్లు అమిత్ మహాజన్, రజత్ నాయర్ ఎట్టిపరిస్థితుల్లోనూ చిదంబరానికి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని కోర్టును కోరారు. బెయిల్‌కు ఆయన అర్హుడు కాదని వారు స్పష్టం చేశారు. ఈ కేసు చాలా తీవ్రతరమైనదని, మనీ లాండరింగ్ అనేది ఏ స్థాయిలో ఉన్నా ఖండించి తీరాల్సిందేనని వారు వ్యాఖ్యానించారు. చట్టప్రకారం ఇలాంటి కేసుల్లో బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ఈ దశలో సిబల్ జోక్యం చేసుకుంటూ దర్యాప్తు సంస్థలు ఒక మనిషిపై కేవలం ఆరోపణలు చేస్తేనే సరిపోదని, వాటిని నిరూపించుకోవడానికి సరైన సాక్ష్యాధారాలు కూడా సమర్పించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఇటీవల ఒక కేసు సందర్భంగా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. సాక్షులెవరో తెలియకుండా వారిని చిదంబరం ఏవిధంగా ప్రభావితం చేస్తారని సిబల్ ప్రశ్నించారు. కర్నాటక కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్ కూడా మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారని, ఆయనకు బెయిల్ లభించిందని పేర్కొన్న సిబల్ చిదంబరం విషయంలో అదే సూత్రం ఎందుకు వర్తించదని అడిగారు. 75 రోజుల కస్టడీ తర్వాత కూడా ఇంకా బెయిల్ ఇవ్వకూడదని ప్రాసిక్యూషన్ అధికారులు వాదించడం సరైనది కాదని సిబల్ అన్నారు. ఆయనకు వెంటనే బెయిల్ ఇవ్వాలని కోరారు. కాగా, ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత చిదంబరం బెయిల్ కేసును ఈనెల 8వ తేదీకి వాయిదా వేసింది.
*చిత్రం... కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం