క్రైమ్/లీగల్

టౌన్‌ప్లానింగ్ అధికారి ఇంట్లో ఏసీబీ తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 6: విజయవాడ నగర పాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్ మురళీ గౌడ్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం నిర్వహించిన దాడుల్లో కోటి రూపాయలకు పైగా అక్రమాస్తులు బయటపడ్డాయి. ఆదాయానికి మించి ఆక్రమాస్తుల ఫిర్యాదులపై రాష్ట్రంలోని తిరుపతి, విజయవాడతోపాటు హైదరాబాద్, బెంగళూరులో ఈ తనిఖీలు చేపట్టారు. నగరంలోని పటమట పి అండ్ టి కాలనీలో నివాసముంటున్న బాలగౌని మురళీగౌడ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో టౌన్ ప్లానింగ్ అధికారిగా పని చేస్తున్నారు. ఆయన ఇల్లు సహా ఏకకాలంలో పలుచోట్ల దాడులు చేసిన ఏసిబి అధికారులు మొత్తం కోటి 38లక్షల 75వేల రూపాయలు విలువైన అక్రమ స్ధిర, చర ఆస్తులను గుర్తించారు. దీనిలో భాగంగా 14,50,000 లక్షలు నగదు, ఎనిమిది లక్షలు విలువైన 250గ్రాముల బంగారం, 30వేలు విలువైన కేజీ వెండి సామగ్రి, 20లక్షలు విలువైన బ్యాంకు నిల్వలు గుర్తించారు. 1993మే 26న ప్రభుత్వ శాఖలో ప్రవేశించిన మురళీ గౌడ్ కర్నూలు, తిరుపతి, విజయవాడలో విధులు నిర్వహించారు. ఆయన పేరుతోపాటు భార్య పేరుతో కూడా పలు ఆస్తులు, భూములు, అధికారులు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.