క్రైమ్/లీగల్

కోట్ల ఆస్తులు కూడబెట్టిన ఏఎస్సై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 6: పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా చేరి అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఏఎస్సై)గా పనిచేస్తున్న ఒక చిరుద్యోగి మూడు కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు కూడబెట్టారు. వీటి మార్కెట్ విలువ ఇంకా ఎక్కువ ఉంటుందని సమాచారం. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం జరిపిన సోదాల్లో పలు స్థిరాస్తులు, భారీగా బంగారు ఆభరణాలు, నగదు గుర్తించారు. వివరాలిలావున్నాయి... తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పోర్టు పోలీసు స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న గుణ్ణం వీర వెంకట సత్యనారాయణ చౌదరి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఏసీబీకి సమాచారం అందింది. ఈ మేరకు బుధవారం కాకినాడలోని జగన్నాథపురంలో ఏఎస్సై సత్యనారాయణ చౌదరి ఇంటితో పాటు కరప మండలం అరట్లకట్టలోని ఆయన అత్తగారి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈసందర్భంగా కాకినాడలో సత్యనారాయణచౌదరి పేరిట ఒక భవంతి, భార్య పేరిట రెండు భవనాలు, యానాంలో ఒక భవనం ఉన్నట్టు గుర్తించారు. విజయనగరం జిల్లాలో ఇళ్ల స్థలాలు, పిఠాపురంలో 33 సెంట్లు వ్యవసాయ భూమి, వల్లూరులో కుమార్తె పేరిట 12.5 సెంట్లు, కుమారుని పేరిట 12.5 సెంట్లు వ్యవసాయ భూమి ఉన్నట్టు గుర్తించారు. రూ.30 లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు, రూ.6.17 లక్షల ఫిక్సెడ్ డిపాజిట్లు, బ్యాంకు ఖాతాలో రూ.7.98 లక్షల నగదు ఉన్నట్టు గుర్తించారు.1.424 కిలోల బంగారు ఆభరణాలు, 181 గ్రాముల వెండి వస్తువులు, రూ.29,900 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఒక మారుతీ కారు, బైక్ ఉన్నట్టు గుర్తించారు. అలాగే కరప మండలం, అరట్లకట్టలో నివాసం ఉంటున్న అత్తగారు మార్ని సీతమ్మ అలియాస్ ఫాస్టరమ్మ రెండు అంతస్తుల భవనంలోని పై అంతస్తులో చర్చి నిర్వహిస్తుండగా, కింది అంతస్తులోని ఒక గదిలో సత్యనారాయణ చౌదరికి సంబంధించిన కీలక పత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఒక రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి సర్వే నెం.353, 358, 378 గల మూడు ప్లాట్లు కొనుగోలు పత్రాలు గుర్తించారు. అందులో రెండు ప్లాట్లు సత్యనారాయణ పేరుమీద, మరో ప్లాటు ఆయన భార్య వరలక్ష్మి పేరు మీద రిజిష్టర్ చేసినట్లు గుర్తించారు. అలాగే తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో ఒక చిట్‌ఫండ్ కంపెనీలో నెలకు రూ.20 వేలు వంతున 2015 నుంచి చిట్ కడుతున్నట్టు రశీదులు లభ్యమయ్యాయి. దీంతో పాటు రెండు ఖాళీ ప్రామిసరీ నోట్లు, కాకినాడ ఐడీబీఐ బ్యాంకులో 750 గ్రాముల బంగారాన్ని కుదువ పెట్టిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎల్‌ఐసీలో ఏడాదికి రూ. 50 వేలు చెల్లిస్తున్న రశీదులు కూడా లభ్యమయ్యాయి.ఏఎస్సై సత్యనారాయణ చౌదరిని అదుపులోకి తీసుకుని, ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నట్టు ఏసీబీ అదనపు ఎస్పీ పి రవికుమార్ తెలిపారు. ఈ సోదాల్లో ఏసీబీ డీఎస్పీ పి రామచంద్రరావు, ఇన్‌స్పెక్టర్లు వి పుల్లారావు, పివిజి తిలక్, సూర్యమోహన్, ఎస్సై నరేష్ తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... ఏఎస్సై ఇంట్లో బయటపడిన బంగారం, పత్రాలు, నగదు