క్రైమ్/లీగల్

ఆర్టీసీ విభజనే జరగలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 7: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అనంతరం షెడ్యూలు -9లోని సంస్థలు, కార్పొరేషన్లలో ఏపీఎస్‌ఆర్టీసీ విభజన ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని కేంద్ర ప్రభుత్వం గురువారం నాడు హైకోర్టులో జరిగిన విచారణలో పేర్కొంది. కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ నామవరపు రాజేశ్వరరావు వాదనలు వినిపించారు. పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలు ఎపీఎస్‌ఆర్టీసీని కొన్ని నిబంధనలతో 52:48 నిష్పత్తిలో విభజించాల్సి ఉందని, ఆ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదన్నారు. ఆస్తులు, అప్పులకు సంబంధించి కేంద్ర హోంశాఖ లెక్కలు తీస్తోందని, ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు జరుగుతున్నాయని అన్నారు. కేంద్రానికి ఏపీఎస్‌ఆర్టీసీలో 33 శాతం వాటా ఉందని, ఆ వాటా నేరుగా టీఎస్‌ఆర్టీసీకి బదిలీ కాదన్నారు. టీఎస్‌ఆర్టీసీ ఏర్పాటుకు కేంద్రం అనుమతి పొందాలని, అనుమతి పొందినట్టు ఆధారాలు లేవన్నారు. టీఎస్‌ఆర్టీసీ విభజన ద్వారా ఏర్పాటైందా? లేదా కొత్తగా ఏర్పడిందా? అనేది తేలాల్సి ఉందరు. అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ వాదనలతో ఆర్టీసీకి సంబంధించి కొత్త సాంకేతిక అంశాలు తలెత్తాయి. ఒకవేళ ఆస్తులు, అప్పుల విభజన జరిగితే ఎవరి వాటా ఎంత అనేది కూడా తేలాల్సి ఉంది. మరో పక్క ఈ మొత్తం గణాంకాల్లో కేంద్రం వాటా కూడా తేలాలి. ఈ వాటాలు తేలితే తప్ప టీఎస్‌ఆర్టీసీకి వచ్చిన ఆదాయం- నష్టాల లెక్కలు స్పష్టంగా తేలే అవకాశం లేదని చెబుతున్నారు. ఒక వేళ పునర్విభజన చట్టం ద్వారా కాకుండా నేరుగా టీఎస్‌ఆర్టీసీ ఏర్పడితే కేంద్రం వాటా అనే అంశమే తలెత్తే అవకాశం లేదని, అది కూడా సాంకేతికంగా ఇబ్బందికర అంశమేనని చెబుతున్నారు.