క్రైమ్/లీగల్

ఇన్ని అబద్ధాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 7: ఆర్టీసీ సమ్మెకు సంబంధించి గురువారం వాదనలు జరిగిన సందర్భంగా హైకోర్టు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. 11వ తేదీలోగా చర్చలు జరపాలని ఆదేశించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్ సింగ్ ఐఏఎస్‌లపై అసహనం వ్యక్తం చేశారు. అధికారుల సమర్పించిన నివేదికల్లోని అంశాలపై మండిపడ్డారు. సుదీర్ఘ వాదనల అనంతరం విచారణ 11వ తేదీకి వాయిదా వేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి, రామకృష్ణారావు, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ సహా పలువురు అధికారులు కోర్టు ముందు హాజరయ్యారు. అలాగే కేంద్రప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ తమ వాదనలు వినిపించారు. మూడు రాష్ట్రాల్లో తాను న్యాయమూర్తిగా
పనిచేశానని, 15 ఏళ్ల కాలంలో ఏ ఐఏఎస్ అధికారీ ఈ స్థాయిలో గందరగోళ లెక్కలతో, పదాలతో నివేదికలు ఇవ్వలేదని న్యాయమూర్తి చౌహాన్ వ్యాఖ్యానించారు. ఇంతగా అబద్ధాలు చెప్పే అధికారులను చూడలేదని మండిపడ్డారు. ఐఏఎస్ అధికారులు రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాలని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ, ఆర్టీసీ, జీహెచ్‌ఎంసీ దాఖలు చేసిన అఫిడవిట్లలో విభిన్నమైన నివేదికలు ఉండటంపై అధికారులను సీజే నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, రవాణా మంత్రిని ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ తప్పుదారి పట్టించారని వ్యాఖ్యానించారు. సమస్య పరిష్కారానికి, సయోధ్యకు న్యాయస్థానం ప్రయత్నిస్తోందని, అయితే, ఇరువర్గాలూ స్వచ్ఛందంగా ముందుకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పూర్తిగా లోపించిందని సీజే అన్నారు. ఇది కేవలం 49వేల మంది కార్మికుల అంశమే కాదని, తెలంగాణ సమాజం కూడా ఇబ్బందుల్లో ఉందని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కేవలం 47 కోట్లు ఇవ్వమంటే ప్రభుత్వం ఇవ్వడం లేదని, మిగిలిన పథకాలకు వేల కోట్లు మంజూరుచేస్తోందని అంటూ, ప్రభుత్వ వైఖరి ఏమిటో అర్థం కావడం లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ సారీ చెప్పగా, న్యాయస్థానానికి క్షమాపణలు అక్కర్లేదని, సమస్యకు పరిష్కారం కావాలని సీజే స్పష్టం చేశారు. మూడు మార్లు ఆర్టీసీ తరఫున అఫిడవిట్లు దాఖలయ్యాయని, ఆ మూడు పత్రాల్లోనూ అంశాలు వేర్వేరుగా ఉన్నాయని ఆయన తెలిపారు. నివేదికలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే కోర్టు ధిక్కారణ కిందకు వస్తుందని సీజే హెచ్చరించారు. రికార్డులు పరిశీలించిన తర్వాతే నివేదిక ఇస్తున్నట్టు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు వివరణ ఇవ్వగా, స్పందించిన న్యాయమూర్తి మొదటి నివేదిక చూడకుండానే రెండో నివేదిక ఇచ్చారా? అని ప్రశ్నించారు. సమయాభావం వల్ల రికార్డుల ఆధారంగా నివేదికను రూపొందించామని, జరిగిన పొరపాటుకు మన్నించాలని రామకృష్ణారావు అన్నారు. అయితే, కోర్టుకు క్షమాపణలు అవసరం లేదని, వాస్తవాలు చెప్పాలని సీజే అన్నారు. హైకోర్టును తప్పుదారిపట్టించేందుకు చాలా తెలివిగా గజిబికి లెక్కలు, పదాలు వాడారని సీజే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఎండీ చెప్పే లెక్కలూ, జీహెచ్‌ఎంసీ నివేదిక, ప్రభుత్వ ఆర్థిక శాఖ నివేదికలు వేర్వేరుగా ఉన్నాయని అన్నారు.
ఆర్టీసీ విభజన ప్రక్రియ పూర్తి కాలేదని కేంద్ర ప్రభుత్వం చేసిన వాదనలపై ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి మాట్లాడుతూ ఆర్టీసీ పునర్విభజన షెడ్యూలు 9 కిందకు వస్తుందని అన్నారు. పునర్విభజన చట్టంలోని సెక్షన్-3 ప్రకారం టీఎస్‌ఆర్టీసీని ఏర్పాటు చేసినట్టు ఆర్టీసీ ఎండీ కోర్టుకు చెప్పారు. ఆర్టీసీ విభజన అంశం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని వివరించారు. ఒకవైపు విభజన పెండింగ్‌లో ఉందని చెబుతూనే మరో వైపు ఆర్టీసీని ఏర్పాటు చేశామని అంటున్నారని, అది ఎలా సాధ్యమని సీజే నిలదీశారు. ఏపీఎస్‌ఆర్టీసీ విభజనకు రెండు రాష్ట్రాలు కేంద్రం అనుమతి తీసుకోవాలి కదా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి సమస్య పరిష్కరించే ఉద్దేశం ఉందా? లేదా? అని అడిగారు. 11వ తేదీలోగా చర్చలు జరిపి, వివరాలతో రావాలని పేర్కొంటూ విచారణను వాయిదా వేశారు.