క్రైమ్/లీగల్

చైన్ స్నాచర్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, నవంబర్ 7: ముగ్గురు చైన్ స్నాచర్లను చిలకలగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించి, వారి నుంచి ఎనిమిది గ్రాముల బంగారం, ద్విచక్ర వాహనం, మొబైల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వారాసిగూడలోని శ్రీదేవి నర్సింగ్ హోమ్‌లో చికిత్స పొందుతున్న తన తండ్రికి మందులు తీసుకురావడానికి గత నెల 31న అర్ధరాత్రి పక్కనే ఉన్న మెడికల్ షాపునకు పసుపులేటి గోవింద్ వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై ముగ్గురు వచ్చి మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని రంగంలో దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ద్విచక్ర వాహనాన్ని, చోరీకి పాల్పడిన వ్యక్తులు మణికేశ్వర్ నగర్‌కు చెందిన గండికోట ప్రభు, ఓర్సు వెంకటేష్. మధర్ సందీప్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ బాలగంగి రెడ్డి తెలిపారు. గండికోట ప్రభు పాతనేరస్థుడని, అతనిపై మొత్తం తొమ్మిది కేసులు ఉన్నట్లు విచారణలో తేలిందని వెల్లడించారు. గోపాలపురం ఏసీపీ వెంకటరమణ ఆదేశాల మేరకు పీడీ యాక్ట్ నమోదుకు సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు.
జల్సాలకు అలవాటుపడి..
ఉప్పల్7: జల్సాలకు అలవాటుపడి..సులభంగా డబ్బు సంపాదన కోసం దొంగలుగా అవతారమెత్తిన ఆరుగురు బాలురు, దొంగ సొత్తును కొనుగోలు చేసిన ఇద్దరిని మేడిపల్లి పోలీసులు పట్టుకున్నారు. 13 దొంగతనాలలో వీరి నుంచి రూ.7లక్షల 50వేల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు మల్కాజిగిరి డీసీపీ రక్షిత కే.మూర్తి తెలిపారు. గురువారం మేడిపల్లి పీఎస్‌లో ఏసీపీ నర్సింహా రెడ్డి, ఇన్‌స్పెక్టర్ అంజి రెడ్డి, ఎస్‌ఐ రఘురామ్, ఏఎస్‌ఐ మల్లేష్, సిబ్బందితో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం బడి మానేసిన ఆరుగురు బాలురు జల్సాలకు అలవాటు పడి ఎంజాయ్ చేయడానికి డబ్బులు సంపాదన కోసం దొంగలుగా మారారు. దోచుకున్న వస్తువులను పెట్టుకుని డబ్బులు ఇస్తూ దొంగతనాలకు ప్రోత్సహిస్తున్న పీర్జాదిగూడ శంకర్‌నగర్‌కు చెందిన షేక్ గౌస్, షేక్ హుస్సేన్‌ను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. పట్టుబడిన ఆరుగురిపై గతంలో కేసులు ఉన్నాయని తెలిపారు. వీరిని జువైనల్ హోమ్‌కు పంపించి పై ఇద్దరిని కోర్టుకు రిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు.