క్రైమ్/లీగల్

హత్యాయత్నం కేసులో ఇద్దరికి రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెహిదీపట్నం, నవంబర్ 7:డబ్బులు ఇవ్వకపోవడంతో హత్యా ప్రయాత్నం చేసిన ముగ్గురిలో ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు. వివరాలను పశ్చిమ మండల డీసీపీ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. గోల్కొండకు చెందిన సయ్యద్ సాజిద్ రేషాంబాగ్‌లో సెలూన్ షాపు నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన అబ్ధుల్ బాసిత్ హుసేన్(19) ఆటోడ్రైవర్, అతని మిత్రుడు మహ్మాద్ జామీర్(20) మెకానిక్, మహ్మద్ రియాజ్ ముగ్గురు మిత్రులు. ఈనెల 5న సయ్యద్ సాజిద్‌ను డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోవడంతో కత్తితో దాడి చేశారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అబ్దుల్ బాసిత్ హుసేన్, మహ్మద్ జమీర్‌ను రిమాండ్‌కు తరలించారు. బాసిత్‌పై ఐదు కేసులు ఉన్నాయని, మహ్మద్ జమీర్‌పై కూడా గోల్కొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు ఉన్నట్లు డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. మహ్మద్ రియాజ్ పరారీలో ఉన్నాడు. నిందితులను పట్టుకున్న ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాస్ దాసును డీసీతోపాటు ఆసీఫ్‌నగర్ ఏసీపీ జీఆర్ శివమారుతి అభినందించారు.