క్రైమ్/లీగల్

మేడ్చల్ కలెక్టరేట్ లో ఏసీబీ కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, నవంబర్ 7: మేడ్చల్ జిల్లా పంచాయతీ అధికారి రవి కుమార్ లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే.. గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ బేరీ ఈశ్వర్ ఆడిట్ క్ష్లియర్ చేయటానికి జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్ రూ.15 లక్షలు డిమాండ్ చేశారు. ఐదు లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏసీబీని ఈశ్వర్ ఆశ్రయించారు. ఈశ్వర్ నుంచి పూర్తి వివరాలు తీసుకొని ఏసీబీ అధికారులు పథకం పన్నారు. ముందుగా లక్ష రూపాయలు ఇచ్చేందుకు ఈశ్వర్ కీసరలోని కలెక్టరేట్‌కు వచ్చాడు. డీపీఒ ఛాంబర్‌లోకి వెళ్లి లక్ష రూపాయలు అందజేసారు. అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా రవి కుమార్‌ను పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలోని రికార్డులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ పాల్గొన్నారు.

*
ఆంధ్రభూమి బ్యూరో