క్రైమ్/లీగల్

హుక్కా సెంటర్లలో మామూళ్లు: ఆరుగురు పోలీసుల సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 7: మామూళ్ల మత్తులో జోగుతున్న హైదరాబాద్ పోలీసులపై పోలీస్ బాస్ సీరియస్ అయ్యారు. హుక్కా సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించి కస్టమర్లను బెదిరించి డబ్బు వసూలు చేసిన విషయం సీపీ దృష్టికి రావడంతో విచారణ చేయించారు. విచారణ చేపట్టిన తరువాత నలుగురు ఎస్‌ఐలు, ఇద్దరు ఏఎస్‌ఐలను సీపీ విధుల నుంచి తొలగించారు. నగరంలోని పలు హుక్కా సెంటర్లలో రాత్రివేళల్లో అక్రమంగా నడుస్తున్నాయనే సమాచారంతో వీరంతా దాడులకు వెళ్లినట్టుగా తెలుస్తోంది. దాడులకు వెళ్లిన వీరు, అక్కడి కస్టమర్లను, నిర్వాహకులను బెదిరించి మామూళ్లు వసూలు చేశారు. ఈ విషయంలో కొందరు బాధితులు.. అంజనీ కుమార్‌కు వ్యక్తిగతంగా ఫిర్యాదు చేయడంతో స్పందించారు. శాఖాపరమైన విచారణ జరిపి, ఎస్‌ఐలు కురుమూర్తి, శ్రీను, శంకర్, రామకృష్ణ, ఏఎస్‌ఐలు మహ్మద్ జాఫర్, శామ్యూల్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.