క్రైమ్/లీగల్

తహశీల్దార్ విజయరెడ్డి హత్యకేసు నిందితుడు సురేశ్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 7: అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు సురేష్ మృతి చెందాడు. సురేష్ మరణించినట్టు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. చికిత్స పొందుతూ సురేష్ గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు చనిపోయాడని డాక్టర్లు పేర్కొన్నారు. ఈనెల 4న అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డిని ఆమె కార్యాలయంలో సురేశ్ పెట్రోల్ పోసి సజీవదహనం చేయడం.. ఆపై ఆత్మహత్యకు యత్నించడం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన సురేశ్‌ను ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి క్రమంగా విషమిస్తోందని వైద్యులు ఇంతకుముందే వెల్లడించారు. సురేష్ మృత దేహానికి పోస్టుమార్టం జరిపిన అనంతరం అతని కుటుంబసభ్యులకు అప్పగించారు. సురేష్ చనిపోవడంతో అతని కుటుంబసభ్యులు తీవ్ర దుఃఖంలో ఉన్నారు. తన కుమారుడు తప్పు చేయలేదని, ఎవరో వెనుక ఉండి తప్పు చేయించారని సురేష్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మరో వైపు తహశీల్దార్ విజయరెడ్డి సజీవ దహనం కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. విజయారెడ్డిపై దాడికి ముందు ఆమె ఇంటి వద్ద నిందితుడు సురేశ్ రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. విజయారెడ్డి హత్య తర్వాత ఆఫీసు నుంచి బయటికొచ్చిన సురేశ్ కారులో ఉన్న వారితో మాట్లాడినట్లు గుర్తించారు. వారు ఎవరో తెలియాల్సి ఉందని, వారి ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గౌరెల్లి గ్రామంలో పోలీసు పహారా మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.