క్రైమ్/లీగల్

ఇండియన్ లా అమలులో ఇబ్బందులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: భారత చట్టాలు చాలా వరకూ వేర్వేరు దేశాల నుండి కాపీ చేసినవేనని, దీనివల్ల ఆ చట్టాలను మన దేశంలో అమలుచేసినపుడు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పేర్కొన్నారు. అడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజీ ఆఫ్ ఇండియాలో నిర్వహించిన ట్రూత్ ల్యాబ్స్ ఫోరెన్సిక్ సర్వీసెస్ 12వ ఫౌండేషన్ డే ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సైన్స్ - లా అండ్ జస్టిస్ అనే అంశంపై ఉపన్యాసం ఇచ్చారు. క్రిమినల్ లా లో ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి వచ్చే ఫలితాలు చాలా కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. కంప్యూటర్లు వచ్చి చాలా సంవత్సరాలు అయినా స్మార్టు ఫోన్లు వచ్చాక టెక్నాలజీలో చాలా పెద్ద మార్పులు వచ్చాయని అన్నారు. టెక్నాలజీ వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో అంతకన్నా ఎక్కువ కాంప్లికేషన్స్ కూడా వస్తున్నాయని పేర్కొన్నారు. టెక్నాలజీని వినియోగించి క్రిమినల్ కేసులను తొందరగా పరిష్కరించడానికి వీలవుతుందని చెప్పారు. 80 శాతం హత్య కేసుల్లో బ్లడ్ సాంపిల్స్ తీసుకున్నా ఆ బ్లడ్ ఏ గ్రూప్‌నకు చెందిందో కూడా కోర్టుకు తెలియజేయరని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎన్ శర్మ, ట్రూత్ ల్యాబ్స్ ఫౌండర్ డాక్టర్ గాంధీ పీసీ ఖాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ట్రూత్‌ల్యాబ్‌ను 2007లో ప్రారంభించామని అన్నారు. ఈట్రూత్‌ల్యాబ్‌లో ప్రశ్నల డాక్యుమెంటేషన్, ఫింగర్‌ప్రింట్ సేవలు, డిఎన్‌ఏ సేవలు, సైబర్ ఫోరెన్సిక్, పాలిగ్రాఫీ, సంఘటనల పరిశోధన, ఆర్ధిక నేరాలు, అనుమానిత బీమా చెల్లింపులు, ఇతర తరహా కేసుల దర్యాప్తు చేపడుతున్నామని అన్నారు. జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య, జస్టిస్ ఎం జగన్నాధరావు వంటి వారి సేవలను వినియోగించుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.