క్రైమ్/లీగల్

31 మంది డీఎస్పీల బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 31 మంది డీఎస్పీలను వివిధ ప్రాంతాలకు బదిలీ చేస్తూ పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లో ఏసీపీలుగా పనిచేస్తున్న 29 మంది ఆయా జిల్లాలకు డీఎస్పీలుగా బదిలీ చేయగా, వరంగల్, సిరిసిల్లకు చెందిన డీఎస్పీలను సైబరాబాద్, హైదరాబాద్‌కు బదిలీ చేశారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఎస్.మహేశ్వర్ రామగుండంకు, కే.నర్సింగ్ రావు సైబరాబాద్ క్రైమ్‌కు, బైరు భాస్కర్ ఎస్‌బీ హైదరాబాద్‌కు, నరుూముద్దీన్ జావీద్ రాచకొండ ఎస్‌బీకి, పీ.కృపాకర్ సిరిసిల్లకు, డీ.ప్రసన్న కుమార్ నాగర్‌కర్నూల్‌కు, ఏ. రామ్‌రెడ్డి రామగుండం ట్రాఫిక్‌కు, అందే రాములు సీఐడీ విభాగానికి, ఎం.సుదర్శన్ కరీంనగర్ టాస్క్ఫోర్స్ విభాగానికి, ఏ.యాదగిరి సిద్దిపేట్ సీసీఎస్‌కు, కే.ప్రసాద్ ఖమ్మంకు, వీ.బాలుజాదవ్ నిజామాబాద్‌కు, పీ.బాలరాజు ఆదిలాబాద్‌కు, వై.వెంకట్‌రెడ్డి హైదరాబాద్ సీసీఎస్ విభాగానికి ఖాజామోహినుద్దీన్ జెన్కో శాఖకు, ఎన్.సైదులు మహబూబ్‌నగర్‌కు, ఎం.సోమనాథం కరీంనగర్ ట్రాఫిక్‌కు, జీ.వెంకట్మ్రణా రెడ్డి నల్గొండకు, జీ.శంకర్ రాజు కరీంనగర్ ట్రాఫిక్‌కు, ఏ.శ్రీనివాసులు కరీంనగర్‌కు, కే.రాజేందర్ ఎక్సైజ్ శాఖకు, ఎస్‌ఆర్.్భంరెడ్డి హైదరాబాద్ మెట్రో రైల్ విభాగానికి బదిలీ అయ్యారు. అదేవిధంగా హైదారాబాద్‌కు చెందిన కే.శ్రీనివాస్ రావు నిజామాబాద్ ఎస్‌బీ విభాగానికి, కే.ఉమా మహేశ్వర్ రావు రాజన్న సిరిసిల్లకు, జే.వేణుగోపాల్ సీసీఎస్ హైదరాబాద్‌కు, ఎన్.రామారావు జగిత్యాల ఎస్‌బీ విభాగానికి, కే.రమేష్ వరంగల్‌కు, పీ.సాంబాయ్య వరంగల్‌కు, కే.వెంకటేశ్వర్లు హైదరాబాద్ సీటీసీకి బదిలీ కాగా, వరంగల్‌కు చెందిన శ్యాంసుందర్ సింగ్ హైదాబాద్ డిటెక్టివ్ విభాగానికి, రాజన్న సిరిసిల్లకు చెందిన కే.నరహరి సైబరాబాద్‌కు బదిలీ అయిన వారిలో ఉన్నారు.