క్రైమ్/లీగల్

‘టిక్‌టాక్’తో పరిచయం ప్రేమపేరుతో మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, నవంబర్ 8: ‘టిక్‌టాక్’ యాప్ ద్వారా పరిచయమైన యువతీయువకుల మధ్య ప్రేమ వ్యవహారం బెడిసికొట్టింది. దీంతో యువకులు పోలీస్‌స్టేషన్‌లో ఊచలు లెక్కబెడుతుండగా, యువతులను ఉజ్వల్ హోంకు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం మక్తమాసాన్‌పల్లికి చెందిన 21 యేళ్ల లోపు ఇద్దరు యువతులతో ఏపీలోని అనంతపురం జిల్లా బొమ్మన్‌హల్ మండలం దర్గా హొన్నూర్‌కు చెందిన వంశీ, వన్నూరు స్వామిలతో టిక్‌టాక్ యాప్ ద్వారా 6 నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారి చివరకు పెళ్ల్లి వరకు వెళ్లింది. మీరు వస్తే పెళ్లి చేసుకుందామని వారు అనడంతో మూడు రోజుల క్రితం మక్తమాసాన్‌పల్లికి చెందిన యువతులు ఇద్దరూ తమ ప్రియులైన వంశీ, వన్నూరు స్వామి సొంత గ్రామమైన దర్గాహొన్నూర్‌కు చేరుకున్నారు. వారిని పెళ్లి చేసుకోవడానికి తాము 600 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చామని, తమను పెళ్లి చేసుకోవాలని, అన్యాయం చేయవద్దని మొరపెట్టుకున్నారు. అయితే వారి ప్రేమను తిరస్కరించిన వంశీ, వన్నూరు స్వామి వారిని ఇంటి నుండి గెంటి వేయడంతో ఆహారం సైతం లేక ఆ ఇద్దరు యువతులు నీరసించి పడిపోయారు.
దీంతో అక్కడి గ్రామస్తులు పోలీస్‌స్టేషన్‌కు సమాచారం చేరవేయడంతో పోలీసులు దర్గాహొన్నూర్‌కు చేరుకొని యువతీ, యువకులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. వంశీ, స్వామి బుకాయించి ఆ ఇద్దరు యువతుల గురించి తమకు తెలియదని, వారు కావాలని తమ పరువు తీసే క్రమంలో ఇక్కడికి చేరుకున్నట్టు పేర్కొన్నారు. దీంతో వంశీ, స్వామిలను పోలీసులు అదుపులోనే ఉంచుకోగా, గజ్వేల్ మండలం మక్తమాసాన్‌పల్లికి చెందిన యువతులను అనంతపురం జిల్లా ఉజ్వల్‌హోంకు తరలించిన పోలీసులు శుక్రవారం ఇక్కడికి సమాచారం చేరవేశారు.