క్రైమ్/లీగల్

వృద్ధ దంపతుల ఆత్మహత్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహదేవ్‌పూర్, నవంబర్ 8: వారికెలాంటి ఇబ్బందులు లేవు. ఆర్థికపరమైన సమస్యలూ లేవు. ఆస్తిపాస్తులకు కొదువ లేదు. ఇద్దరు భార్యాభర్తలదీ అన్యోన్య జీవితం. నలుగురు సంతానాన్ని ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పెద్ద చేసి పెళ్లిళ్లు కూడా చేశారు. చివరి దశలో వారికి అండగా నిలబడాల్సిన కన్నవారే వారిని నిర్లక్ష్యం చేయడం సూటిపోటి మాటలనడం, అవమానకరంగా మాట్లాడడాన్ని ఆ వృద్ధ దంపతులు జీర్ణించుకోలేకపోయారు.
ఇక చావుతప్ప తమకు వేరే మార్గం లేదని నిశ్చయించుకొని భార్యభర్తలిద్దరూ పథకం ప్రకారం శుభ సమయం చూసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం ఎలికేశ్వరంలో జరిగింది. తమ మరణానంతరం కూడా తమ వారికి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ముందస్తు పథకం రూపొందించుకొని కొంత నగదును తమవద్ద ఉంచుకొని ఇద్దరూ ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మహదేవ్‌పూర్ మండలం ఎలికేశ్వరం గ్రామానికి చెందిన రాళ్లబండి సాలయ్య (76) అతని భార్య రాధమ్మ (66) మనోవేదనతో తీవ్ర మనస్థాపం చెంది శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. సాలయ్య, రాధమ్మలకు ముగ్గురు కూతుర్లతో పాటు కొడుకు సత్యం ఉన్నారు. నలుగురికి వివాహం కూడా చేశారు. కొడుకు, కోడలికి దూరంగా ఉంటూ తమ వల్ల కొడుకు, కోడలికి గొడవలు కాకూడదనే ఉద్దేశంతో గత కొనే్నళ్లుగా వేరుగా జీవిస్తున్నారు. అప్పుడప్పుడు కొడుకు, కోడలు వృద్ధ దంపతులతో గొడవలు జరిగేవని గ్రామస్థులు చెప్పారు. గురువారం సాయంత్రం ఇంట్లో గొడవ జరిగిందని, ఉదయానే్న సాలయ్య పొలం వద్దకు వెళ్లి పశువులను మేతకు తీసుకెళ్లి వచ్చాడని అనంతరం కోడలు కూడా వీరితో గొడవకు దిగినట్టు గ్రామస్థులు తెలిపారు. ఈ వృద్ధాప్య సమయంలో బాగోగులు చూసుకునేది పోయి తమపై గొడవలకు దిగడంతో మనస్థాపానికి గురై రాత్రి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరి ఆత్మహత్యకు ముందు శుభ ముహూర్తానికి తాము కూడా తనువు చాలించాలని నిర్ణయంచుకుని చనిపోయే ముందు కూడా కొత్త బట్టలు వేసుకొని దహన సంస్కారాలకు కావలసిన సరుకు, సరంజామతో పాటు 20 వేల నగదు కూడా దగ్గర పెట్టుకొని ఆత్మహత్య చేసుకోవడం కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులను కంటతడి పెట్టించింది. విషయం తెలుసుకున్న మహదేవ్‌పూర్ సీఐ నర్సయ్య ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
పోస్టుమార్టం నిమిత్తం మహదేవ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నర్సయ్య తెలిపారు.