క్రైమ్/లీగల్

అమాయకుడి ఉసురు తీశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతపల్లి, నవంబర్ 8: మానసిక స్థితి సరిగ్గాలేని ఒక వ్యక్తి అర్థరాత్రి ఇంట్లోకి ప్రవేశించడంతో దొంగగా భావించి దారుణంగా కొట్టి చంపిన సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని టీకే మల్లేపల్లి శుక్రవారం చోటు చేసుకుంది. డిండి మండలం వాయిల్‌కోల్ గ్రామానికి చెందిన కడారి జంగయ్య (38)కు మానసికస్థితి సరిగ్గా లేకపోవడంతో అతని భార్య సంతోష బంధువులతో కలిసి మండలంలోని టీకే మల్లేపల్లిలో ఉన్న దర్గా వద్ద పూజలు నిర్వహించచడానికి గురువారం రాత్రి చేరుకున్నారు. దర్గా వద్ద అందరూ పడుకొని ఉన్న సమయంలో బహిర్భూమి కోసం వెళ్లిన జంగయ్య గ్రామంలోని గనిపల్లి గణేష్ ఇంట్లోకి జొరపడ్డాడు. దాంతో అర్థరాత్రి ఇంట్లోకి జొరపడిన వ్యక్తిని దొంగగా భావించి ఇంటి యజమాని గనిపల్లి గణేష్ మానసికస్థితి సరిగ్గా లేని జంగయ్యను తాళ్లతోకట్టివేసి తీవ్రంగా కొట్టి గాయపర్చాడు. అదే సమయంలో జంగయ్య కోసం వెతుక్కుంటూ వచ్చిన భార్య సంతోషకు గాయపడిన భర్త కనిపించడంతో రోదించింది. దాంతో బంధువులతో కలిసి తీవ్రంగా గాయపడిన జంగయ్యను చికిత్స కోసం హైద్రాబాద్‌కు తరలిస్తుండగా ఇబ్రహీంపట్నం సమీపంలో జంగయ్య మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై నారాయణరెడ్డి తెలిపారు.