క్రైమ్/లీగల్

12మందిని కబళించిన ఘోర రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగారుపాళ్యం, నవంబర్ 8: చిత్తూరు జిల్లా పలమనేరు - చిత్తూరు రహదారిలో మోగిలి ఘాట్ రోడ్డు లో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందారు. ప్రమాదంలో మృతి చెందిన 8 మంది చిత్తూరు సమీపంలోని తెల్లగుండ్ల పల్లిలో తమ బంధువుల దహనక్రియలకు వచ్చి తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందులో పలమనేరు మండలం మర్రిమాకుల పల్లికి చెందిన 8 మంది మృతి చెందగా కంటైనర్ డ్రైవర్, ద్విచక్రవాహనంపై వస్తున్న ముగ్గురు మరణించారు. బెంగళూరు నుంచి చిత్తూరుకు వస్తున్న కంటైనర్ బ్రేక్ ఫెయిల్ అయ్యి అదుపు తప్పి ఎదురుగా వస్తున్న వాహనాలపై దూసుకు రావడంతో ఈ దుర్ఘనట చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి ఏడున్నర ప్రాంతంలో వాటర్ బాటిళ్లలోడుతో వెళ్తున్న భారీ కంటైనర్ ఘాట్ రోడ్డులోకి రాగానే బ్రేక్‌లు పడక పోవడంతో డ్రైవర్ దాన్ని అదుపు చేయలేక పోవడంతో రోడ్డు డివైడర్‌ను ఢీ కొని ఎదరుగా
వస్తున్న ఆటో, మినీ వ్యాన్ , ద్విచక్రవాహనాలపై దూసుకువెళ్లింది. దీంతో వాహనాల్లో ఉన్న వారంతా అక్కడకక్కడే మృత్యువాత పడ్డారు. కంటైనర్ వేగంగా వచ్చి ఢీ కొనడంతో దీని దాటికి ఎదురుగా వస్తున్న వాహనాలు అన్ని నుజ్జు, నుజ్జు అయ్యాయి. కంటైనర్ కూడా రెండుగా విడిపోయింది. మృత దేహాలన్ని గుర్తు పట్టలేని విధంగా ఛిద్రమైయ్యాయి. జేసీబి ద్వారా వాహనాలను వెలికి తీయాల్సి వచ్చింది. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతమంతా చీకటిగా ఉండడంతో ఇంకా ఏమైనా మృతదేహాలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే ఎస్‌పి, కలెక్టర్, పూతలపట్టు ఎమ్మెల్యే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు.ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ 50వేల ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.