క్రైమ్/లీగల్

ఇద్దరిని బలిగొన్న డ్రైవర్ నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం రూరల్, ఏప్రిల్ 17: డ్రైవర్ నిర్లక్ష్యం ఇద్దరు వ్యక్తులను బలితీసుకుంది. గ్రానైట్ రాళ్ళ లోడ్‌తో వెళ్తున్న టారస్ లారీ రెప్పపాటు పాటుగా వచ్చి షాపు ముందున్న ఆ ఇద్దరినీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మంగళవారం ఉదయం ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. గ్రామానికి చెందిన షేక్ వౌలాన్‌బీ (35) తన ఇంటిముందున్న దుకాణం వద్దకు వచ్చిన ద్విచక్రవాహనానికి గాలి మిషన్ ద్వారా గాలి పెట్టే ప్రయత్నం చేస్తోంది. తన మరిది పాషా రెండవ చిన్నకుమారుడు షారూక్‌ఖాన్ (6) కూడా తన పక్కనే ఉన్నాడు. అదేసమయంలో కరీంనగర్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీ ఒక్కసారిగా దూసుకొని వచ్చి ఢీకొనడంతో ఆతల్లీకొడుకులు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనలో వౌలాన్‌బీ కాలు విరిగి తలకు బలమైన గాయాలు కాగా, షారూక్‌ఖాన్ తలకు బలమైన దెబ్బ తగిలి మెదడు చింది 20 మీటర్ల దూరంలో చిందిపడడంతో పాటు ప్రేగులు బయటకు వచ్చాయి. గాలి మిషన్ పూర్తిగా ధ్వంసమైంది. బైక్‌కు గాలి పెట్టించేందుకు వచ్చిన సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం త్రిపురారం గ్రామానికి చెందిన కొత్త రాఘవరెడ్డికి స్వల్ప గాయాలు కాగా, అతని కుమారుడు నరేష్‌రెడ్డి ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. వీరు తమ బంధువులతో కలిసి సోమవారం రాత్రి ఆరెంపుల దర్గాలో నిద్ర చేసేందుకు వచ్చారు. రాఘవరెడ్డి ఖమ్మం ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న ఖమ్మం రూరల్ ఎస్‌ఐ చిరంజీవి, సిబ్బంది సంఘటనా ప్రదేశానికి చేరుకొని పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. హృదయవిదారకంగా ఉన్న సంఘటనా దృశ్యాలను చూసి ప్రతి ఒక్కరూ కంటతడిపెట్టారు. మృతురాలు వౌలాన్‌బీకి భర్త యాకూబ్‌జానీ, ఇద్దరు కుమార్తెలు సోనీ, సన, మృతుడు షారూక్‌ఖాన్‌కు తల్లిదండ్రులు పాషా, నసీమా, సోదరుడు తాజ్ ఉన్నారు.

సంఘటనా ప్రదేశాన్ని సందర్శించిన ఏసీపీ
టారస్ ఢీకొని ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన సంఘటనా ప్రదేశాన్ని ఖమ్మం రూరల్ ఎసిపి పింగళి నరేష్‌రెడ్డి, ట్రాఫిక్ ఎసిపి సదానిరంజన్ మంగళవారం సందర్శించారు. సంఘటన పూర్వాపరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. సంఘటనా ప్రదేశానికి సమీపంలో ఉన్న మూలమలుపు వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.