క్రైమ్/లీగల్

నెల్లూరు ఐసీడీఎస్ పీవోకు జైలుశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 8: నెల్లూరు జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి బాలిరెడ్డి సుధాభారతికి నెల్లూరులోని 2వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు 6 నెలలు జైలు శిక్షను విధించింది. ఆమెతో పాటూ భర్త వీఎస్ మురళీకృష్ణారెడ్డికి కూడా 6 నెలలు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి శుక్రవారం తీర్పు వెలువరించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే మురళీకృష్ణారెడ్డి ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో స్థానిక బుజబుజనెల్లూరుకు చెందిన మంగల భాస్కర్, జరుగుమల్లి అరుణజ్యోతి అనే వారికి ఐదు బ్యాంక్ చెక్కులను ఇచ్చారు. అలాగే తన భార్య సుధాభారతి కూడా ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో వారికి చెక్కులను అందచేశారు. చెక్కులు తీసుకున్నవారు వాటిని బ్యాంకుల్లో జమచేయగా అవి చెల్లలేదు. దీంతో వారు నెల్లూరు 2వ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి శుక్రవారం తీర్పును వెలువరించారు. మొత్తం 5 కేసుల్లో సుధాభారతితో పాటు ఆమె భర్త మురళీకృష్ణారెడ్డిలకు 6 నెలల సాధారణ జైలుశిక్షతో పాటు చెక్కులకు సంబంధించి 27లక్షల17వేల 800లు తిరిగి చెల్లించాలని తీర్పులో ఆదేశించారు.