క్రైమ్/లీగల్

బాలికపై అత్యాచారం, హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, నవంబర్ 8: పెళ్ళికి వచ్చిన ఆరేళ్ళ చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడి, ఆపై పైశాచికంగా హత్యచేసిన విషాధసంఘటన శుక్రవారం చిత్తూరుజిల్లా కురబలకోట మండలం అంగళ్ళు పంచాయతీ గౌనివారిపల్లి సమీపంలోని ఓ కల్యాణమండపం సమీపంలో చోటుచేసుకుంది. మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి... బి.కొత్తకోట మండలం గట్టు పంచాయతీ గుట్టపాలెంకు చెందిన ఎద్దాసిరి సిద్ధారెడ్డి, ఉషారాణి దంపతులు ముగ్గురు కుమార్తెలతో కలసి గురువారం కురబలకోట మండలం గౌనివారిపల్లె సమీపంలోని కెఎన్‌ఆర్ కల్యాణమండపంలో బంధువుల వివాహానికి వచ్చారు. చిన్నకుమార్తె వర్షిణి(5) మండపంలో తోటి చిన్నారులతో ఆటలాడుకుంటుండగా ఓ యువకుడు ఆచిన్నారిపై కనే్నసి, ఫోటోలు తీస్తూ, తీసిన ఫోటలు ఆ చిన్నారికి చూపించి, సెల్‌ఫోన్ చేతికిస్తూ ఆకట్టుకున్నాడు. గురువారం రాత్రి ఆ చిన్నారి కోసం తల్లిదండ్రులు మండపంలో వెతికినా కన్పించకపోవడంతో పెళ్ళిల్లో ఎక్కడైనా పడుకుని ఉంటుందని భావించ మిన్నకుండిపోయారు. మరుసటిరోజు వచ్చి రాత్రి 10గంటల వరకు వెతికినా చిన్నారి వర్షిణి కన్పించలేదు. శుక్రవారం ఉదయం మండపం, పరిసర ప్రాంతాలలో వెతికారు. అయితే పెళ్లి మండపం వెనుక ఉన్న వంకలో చిన్నారి వర్షిణి శవమై కన్పించింది. శరీరమంతా పెనుగులాడి రాసుకున్న గాయాలు ఉన్నాయి. తల నుదిటిపై చిన్నగాయం, తేలకళ్ళతో మృతిచెంది కన్పించింది. అయితే చిన్నారికి చెందిన ప్యాంటు పెళ్ళిమండపంలోని ఓ బాతురూమ్‌లో పడివుండటం అక్కడున్నవారు గమనించారు. కామాంధుడు తప్పించుకునేందుకు తెలివిగా, చిన్నారి బహిర్భూమికి వెళ్లినట్లు సంఘటన ప్రాంతాలో చిత్రీకరించాడు. మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐ అశోక్‌కుమార్, ఎస్‌ఐ సుకుమార్ పరిశీలించారు. అనుమానాస్పద స్థితిలో ఉండటంతో చిత్తూరు క్లూస్‌టీమ్‌తో వేలిముద్రలు, డాగ్‌టీమ్‌తో కల్యాణమండపం పరిసర ప్రాంతాలలో పరిశీలించారు. మృతదేహానికి మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించి కుటుంసభ్యులకు అందజేశారు. అత్యాచారం, హత్య కేసుగా నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కామాంధుడిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా నాలుగు బృందాలను ఏర్పాటుచేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.