క్రైమ్/లీగల్

భవన నిర్మాణ కార్మికుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కపిలేశ్వరపురం, నవంబర్ 10: ఇసుక సంక్షోభం మరో భవన నిర్మాణ కార్మికుడిని మింగేసింది. ఇసుక కొరత కారణంగా పనులు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామంలో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యచేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మద్దిరాల ధనరాజు (34) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతోపాటు తండ్రిని పోషించే బాధ్యత కూడా ధననరాజుదే. అయితే గత కొన్ని నెలలుగా పనులు లేకపోవడంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో ధనరాజు ఆదివారం ఉదయం ఇంటి ఆవరణలోని మామిడిచెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యచేసుకున్నాడు. నిద్రలేచిన కుటుంబ సభ్యులు చెట్టుకు ఉరివేసుకుని ఉన్న ధనరాజును చూసి నిర్ఘాంతపోయారు. అప్పటికే ధనరాజు మృతిచెందినట్టు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని స్థానిక వీఆర్వో కె సత్యనారాయణకు తెలియచేయగా, ఆయన పోలీసులకు సమాచారం అందచేశారు. అంగర ఎస్సై ఎం ఏసుబాబు ఆధ్వర్యంలో శవ పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఏడేళ్ల కుమారుడు, 24 రోజుల వయసున్న కుమార్తె ఉన్నారు. సమాచారం అందుకున్న మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతుని కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండు చేశారు.