క్రైమ్/లీగల్

భూమి రిజిస్ట్రేషన్ కాలేదని..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడేరు, నవంబర్ 10: రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖ గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ శాఖ నిర్లక్ష్యం వైఖరి కారణంగా మరో రైతు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం నాగర్‌కర్నూల్ జిల్లాలలో కలకలం సృష్టించింది. కోడేరు మండల పరిధిలోని నాగులపల్లి తండాకు చెందిన రాత్లావత్ బాలు (45) అనే రైతు అనుమానస్పద స్థితిలో ఆదివారం మధ్యాహ్నం తన ఇంటిలో మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం భూ ప్రక్షాళనలో తన పేర ఉన్న మూడు ఎకరాల భూమి ఇతరుల పేర మార్పిడైంది. తన కూతురు వివాహం కోసం సంవత్సరం క్రితం ఈ భూమిని అమ్మాడు. భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి భూమిని పట్టా చేయాలని బాలుపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఆర్వోఆర్ రికార్డులో భూమి తనపేర లేకపోవడంతో ఆరు నెలల నుంచి తన భూమి తనపేర చేయాలని అధికారుల చుట్టూ, భూమి నమోదైనవారి చుట్టూ తిరిగివేసారి మనస్థాపానికి గురై ఇంటిలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. మరికొందరు ఆయన గుండెజబ్బుతో మృతి చెందినట్టు పేర్కొన్నారు. మొత్తంమీద బాలు అనుమానాస్పద మృతి తండాలో చర్చనీయాంశమైంది. పూర్తిస్థాయిలో విచారిస్తే మృతికి గల కారణాలు తెలుస్తాయని గ్రామస్తులు అంటున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.

*చిత్రం...మృతి చెందిన బాలు