క్రైమ్/లీగల్

విద్యుత్ కంచెకు తగిలి రెండు దుప్పులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ రూరల్, నవంబర్ 10: పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగిలి రెండు దుప్పులు హతమయ్యాయి. ఈ సంఘటన మెదక్ జిల్లా హవేళీఘణాపూర్ మండలం గాజిరెడ్డిపల్లి శివారులో ఆదివారం ఉదయం వెలుగుచూసింది. అటవీ అధికారుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన బీమయ్య భూమిని అదే గ్రామానికి చెందిన మంద వెంకయ్య కౌలు చేస్తున్నాడు. ఉదయం కౌలు భూమిలో ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తాకి చుక్కల దుప్పి మృతిచెందినట్టు గుర్తించారు. అటవీ అధికారులు బాచిరెడ్డి, శ్రీనివాస్ నాయక్, అజీజ్, రాజు సందర్శించారు. సంఘటనపై విచారించారు. హవేళీఘణాపూర్ మండల పశువైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్‌ను రప్పించారు. కళేబరాన్ని హవేళీఘణాపూర్ పశువైద్యశాలకు తరలించి పోస్టుమార్టం చేయించారు. ఇంకా ఏమైనా జంతువుల మరణించాయా అన్న సందేహంతో సిబ్బంది గాలించగా కౌలు రైతు వెంకయ్య సొంత భూమిలో ఏర్పాటుచేసిన విద్యుత్ కంచెకు మరో చుక్కల దుప్పి హతమైనట్టు గుర్తించారు. కళేబరాన్ని ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. బాధ్యుడైన వెంకయ్యపై కేసు నమోదు చేసినట్టు అటవీ డిప్యూటీ రేంజ్ అధికారి శ్రీనివాస్ నాయక్ తెలిపారు. కాగా, కౌలు చేస్తున్న పొలం వద్ద చుక్కల దుప్పిని గుర్తించగా రాజకీయ కక్షలతో ఎక్కడో చనిపోతే మరో దుప్పిని ఇక్కడ తెచ్చివేశారని రైతు వెంకయ్య ఆరోపించాడు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు, అటవీ అధికారులు జోక్యం చేసుకుని శాంతింపచేశారు.
*చిత్రం...మృతి చెందిన దుప్పులను పరిశీలిస్తున్న అటవీ అధికారి, పశువైద్యాధికారి