క్రైమ్/లీగల్

కర్నాటక ‘అనర్హ’ ఎమ్మెల్యేల కేసు: రేపు సుప్రీం తుది తీర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కర్నాటకలోని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన 17 మంది అనర్హ ఎమ్మెల్యేల అప్పీళ్లపై సుప్రీంకోర్టు బుధవారం తీర్పును వెలువరించబోతోంది. కర్నాటక అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ తమపై వేసిన అనర్హత వేటును సవాల్ చేస్తూ ఈ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకున్నారు. ఇప్పటికే ఈ అప్పీళ్లపై విచారణ పూర్తి చేసిన సుప్రీం త్రిసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. న్యాయమూర్తులు ఎన్‌వీ రమణ, సంజీవ్ ఖన్నా, కృష్ణ మురారితో కూడి సుప్రీం బెంచ్ ఈ ఎమ్మెల్యేల పిటిషన్‌ను విచారించింది. కర్నాటక అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి కుమారస్వామి విశ్వాస పరీక్షకు ముందే ఈ 17 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. విశ్వాస పరీక్షలో ఓడిపోయిన కుమారస్వామి రాజీనామా చేయడంతో కర్నాటకలో యడియూరప్ప సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ 17 అసెంబ్లీ స్థానాల్లో 15 సీట్లకు డిసెంబర్ 5న ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఈనెల 18లోగా నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. తమ అనర్హత కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడేవరకు ఉప ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాల్సిందిగా సుప్రీంకోర్టును ఈ ఎమ్మెల్యేలు అభ్యర్థించారు. తమను అనర్హులుగా ప్రకటిస్తూ కర్నాటక అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం కక్షసాధింపుగా దురుద్దేశపూరితంగా ఉందని ఈ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు తమకు ఎంతైనా హక్కు ఉందని వారు స్పష్టం చేశారు.