క్రైమ్/లీగల్

హైకోర్టుకూ కొన్ని పరిమితులుంటాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 11: ఆర్టీసీ సమ్మె విరమణకు వీలుగా ఇరుపక్షాలు చర్చించుకుని, సానుకూలమైన నిర్ణయంతో హైకోర్టు ముందుకు రావాలని తాము అనేకమార్లు సూచించినా, ఆ ప్రయత్నం ఇరుపక్షాలూ చేయలేదని హైకోర్టు సోమవారం నాడు వ్యాఖ్యానించింది. దాదాపు రెండు గంటల పాటు వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను మంగళవారం నాటికి వాయిదా వేసింది. రూట్ల ప్రైవేటీకరణపై తదుపరి చర్యలు చేపట్టవద్దన్న ఉత్తర్వులు మంగళవారం వరకూ అమలులో ఉంటాయని హైకోర్టు పేర్కొంది. సోమవారం మధ్యాహ్నం ఈ కేసుపై విచారణ ప్రారంభం కాగానే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తమ నివేదికను సమర్పించింది. కార్మిక శాఖ వద్ద మధ్యవర్తిత్వం ప్రక్రియ పెండింగ్‌లో ఉండగానే కార్మికులు సమ్మెకు వెళ్లారని, తక్షణం కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరేలా హైకోర్టు ఆదేశించాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు రాజ్యాంగంలోని ఏ అధికారం కింద ఈ ఆదేశాలు ఇవ్వాలో వివరించాలని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కనుక ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఆర్టీసీని అత్యవసర సర్వీసుగా పరిగణించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రజాప్రయోజనాల సర్వీసుగా గుర్తించారా? అత్యవసర సర్వీసుగా గుర్తించారా? అని కోర్టు ప్రశ్నించింది. ప్రజాప్రయోజన సేవలు అన్నీ అత్యవసర సర్వీసులుగా నిర్ణయించలేమని, ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఏమైనా ఉత్తర్వులు గతంలో ఇచ్చిందా? ఇస్తే వాటిని కోర్టు ముందుంచండి అంటూ ఆదేశించింది. కోర్టులు కేసులను చట్టం ప్రకారం రాజ్యాంగానికి లోబడి నిర్ణయాలు తీసుకుంటాయని, అంతే తప్ప భావోద్వేగాలు, సానుభూతితో తేల్చలేవని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. చేరితే చేరండి లేకపోతే లేదు అని ప్రభుత్వం కార్మికులకు చెప్పిందని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అలాంటపుడు చర్చలు జరపాల్సిందేనని ప్రభుత్వాన్ని తాము
ఆదేశించలేమని, అలాగే కార్మికులు సమ్మె విరమించాలని కూడా ఇప్పటికపుడు ఆదేశించలేమని పేర్కొంది. మరోవైపు సమ్మెపై కేసుల విచారణలో న్యాయ సహాయానికి ఎమికస్ క్యూరిగా సీనియర్ న్యాయవాది విద్యాసాగర్‌ను కోరింది. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనలను వినిపిస్తూ మరెంతోకాలం ఆర్టీసీ భారాన్ని ప్రభుత్వం భరించలేదని పేర్కొంది. రూట్ల ప్రైవేటీకరణపై మంత్రివర్గం తీసుకున్న తీర్మానాన్ని కూడా హైకోర్టు ముందుంచింది. న్యాయస్థానం సూచన మేరకు 47 కోట్ల రూపాయిలు చెల్లించినా, కార్మికుల సమస్యలన్నీ పరిష్కారం కాబోవని ప్రభుత్వం పేర్కొంది. నాలుగు డిమాండ్ల పరిష్కారానికే 47 కోట్లు చెల్లిస్తే మిగిలిన సమస్యల సంగతి ఏమిటని ప్రభుత్వం పేర్కొంది. ఆర్టీసీ వివిధ పద్దుల కింద 2,209 కోట్లు చెల్లించాల్సి ఉందని, మరోవైపు విలీనంపై కార్మికులు మొండిపట్టుతో వ్యవహరిస్తే చర్చలు సాధ్యం కాదని ప్రభుత్వం పేర్కొంది.