క్రైమ్/లీగల్

కమిటీ వేస్తాం.. మీరేమంటారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారానికి అవసరమైతే సుప్రీంకోర్టుకు చెందిన ముగ్గురు మాజీ న్యాయమూర్తులతో ఒక కమిటీని వేస్తామని హైకోర్టు మంగళవారం నాడు వ్యాఖ్యానించింది. సమ్మెకు పరిష్కారం కనుగొనాలని అటు కార్మిక సంఘాలకు, ఇటు ప్రభుత్వానికి సూచించినా ఫలితం లేకపోయిందని, హైకోర్టు సైతం చట్టపరిధిలోనే పనిచేస్తుందని, పరిధిని దాటి ఎలాంటి ఆదేశాలూ తాము ఇవ్వలేమని పేర్కొంది. సమ్మెపై మంగళవారం నాడు విచారణ సందర్భంగా హైకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. సమ్మె చట్టవిరుద్ధమని తాము ఆదేశాలు ఇవ్వలేమని మరోమారు స్పష్టం చేసింది. 1998లోనూ, 2015లోనూ ఎస్మా పరిధిలోకి ఆర్టీసీని తీసుకువస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఎమికస్ క్యూరీగా నియమితులైన సీనియర్ న్యాయవాది విద్యాసాగరరావు పేర్కొనగా, ఆనాడు ఇచ్చిన జీవోలు ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధించినవని, తెలంగాణ ఆర్టీసీకి అవి వర్తించవని హైకోర్టు తేల్చి చెప్పింది. అయినా ఎస్మా జీవోలు ఆరు నెలలు మాత్రమే కాలపరిమితితో ఉంటాయని పేర్కొంది. సమ్మెకు సంబంధించి ఇరువర్గాల వాదనలనూ కోర్టు విచారించింది. ఒక దశలో పిటిషనర్ తరఫు
న్యాయవాది శశికిరణ్ వాదనలు వినిపిస్తూ సమ్మె కారణంగా ఆర్టీసీ చార్జీలు పెరిగాయని ఆరోపించారు. అయి తే, చార్జీల పెరుగుదల చూసి తాము సమ్మె ఆపమని ఆదేశించలేమని, అలాంటిదేమైనా ఉంటే సంబంధిత కోర్టులను ఆశ్రయించాలని సూచించింది. సమ్మె లీగలా? ఇల్లీగలా? అనేది నిర్ణయించడం తమ పరిధిలో లేదని హైకోర్టు వివరించింది. సుప్రీంకోర్టుకు చెందిన ముగ్గురు మాజీ న్యాయమూర్తులతో కమిటీ అంశంపై ప్రభుత్వ వైఖరి ఏమిటో బుధవారంలోగా చెప్పాలని న్యాయస్థానం అడ్వకేట్ జనరల్‌ను ఆదేశించింది. దీంతో ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ఏజీ చెప్పారు. సమ్మె చట్టవిరుద్ధమని ఆదేశించడానికి కోర్టుకు ఉన్న పరిధి, అధికారాలను వివరించాలని హైకోర్టు పిటిషనర్‌ను, సీనియర్ న్యాయవాది విద్యాసాగర్‌ను కోరింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
సీఎం కోర్టులో ఆర్టీసీ సమ్మె
ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి అవసరమైతే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని హైకోర్టు పేర్కొనడంతో సీఎం కేసీఆర్ ఏవిధంగా స్పందిస్తారోనని ఆర్టీసీ జాక్ నేతలు ఎదురుచూస్తున్నారు. ముగ్గురు సభ్యుల కమిటీ సమస్యలను కొలిక్కి తెచ్చేందుకు దోహదం చేస్తుందా? లేదా? సమస్యను మరింత ఇబ్బందికర పరిస్థితికి తీసుకువెళ్తుందా? అనే అంశంపై సీఎం సీనియర్ అధికారులతోనూ, న్యాయనిపుణులతోనూ చర్చించినట్టు తెలిసింది. ఆర్టీసీని ఏంచేయాలో, ఏం చేయకూడదో, దీనికి ఎలాంటి ముంగింపు ఇవ్వాలో కమిటీయే సూచిస్తుంది కనుక ప్రభుత్వానికి ఇబ్బంది తొలగిపోతుందనే సూచనలు సీఎంకు వచ్చినట్టు తెలిసింది. మాజీ న్యాయమూర్తుల కమిటీ కనుక ఆ కమిటీ ముందు ఆర్థిక పరిస్థితులతోపాటు అన్ని రకాల సమస్యలను వివరించేందుకు ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉండడంతోపాటు విడమరిచి చెప్పే వీలుంటుందని సీఎం భావిస్తున్నారు. కమిటీ వల్ల ప్రభుత్వానికే ఎక్కువ మేలు జరుగుతుందనే భావన కూడా వ్యక్తమవుతోంది. కాగా, బుధవారం ఉదయానికి ఏ విషయం సీఎం స్పష్టం చేస్తే తదనుగుణంగా అధికారులు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది.