క్రైమ్/లీగల్

భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూ భర్త ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, నవంబర్ 12: భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూ లైవ్‌గా ఉరివేసుకుని భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రీతమ్ సింగ్(22) దిల్లీకి చెందిన తన భార్య నాన్సీ శర్మతో కలిసి జీవనోపాధి నిమిత్తం మేడ్చల్ ప్రాంతానికి వలసవచ్చి స్థానికంగా విజయ్‌సింగ్ అనే వ్యక్తి చెందిన ట్రాన్స్‌పోర్ట్‌లో పనిచేస్తున్నాడు. భార్య నాన్సీ వారికే చెందిన స్టేషనరీ షాపులో పనిచేస్తుంది. దంపతులిద్దరు రాఘవేంద్రనగర్ (అత్వెల్లి) వసంత రెసిడెన్సీలో విజయ్‌సింగ్‌కు చెందిన ఇంటిలోనే నివాసం ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం నాన్సీ శర్మ తన తల్లి ఆరోగ్యం బాగా లేదని ధీల్లికి వెళ్లింది. రోజు మాదిరిగానే సోమవారం తన విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న ప్రీతమ్ సింగ్ రాత్రి తోమ్మిది నుంచి 10 గంటల ప్రాంతంలో భార్య నాన్సీతో ఫోన్లో విడీయో కాల్ మాట్లాడుతూ సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు. నాన్సీ వెంటనే తనకు తెలిసిన వారికి ఫోన్ ద్వారా ప్రీతమ్ సింగ్ ఉరివేసుకున్నాడు తక్షణమే వెళ్లి కాపాడండని చెప్పింది. వారు వచ్చి తలుపు బద్దలు కొట్టి లోనికి వెళ్లి చూసేసరికి ప్రీతమ్ సింగ్ విగతజీవిగా మారాడు. దంపతులిద్దరి మధ్య గొడవ ఆత్మహత్యకు దారితీసినట్లు తెలిసింది. నిత్యం ప్రీతమ్ సింగ్ ఇద్దరు లేదా మిత్రులు ఉండేవారు సోమవారం రాత్రి ఎవరూలేని సమయంలో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు.