క్రైమ్/లీగల్

సోషల్ మీడియాపై ‘నిఘా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 12: అయోధ్యపై సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును వక్రీకరిస్తూ సామాజిక మాధ్యమం (సోషల్ మీడియా)లో వదంతులు సృష్టిస్తున్న 70 మందిని అరెస్టు చేశామని ఉత్తర్ ప్రదేశ్ పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజిపీ) ఓపీ సింగ్ తెలిపారు. ఇంకా తప్పుడు కథనాలతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్న 270 సోషల్ మీడియా అకౌంట్లపైనా చర్యలు తీసుకున్నట్లు ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో చెప్పారు. సోషల్ మీడియాపై తమ పోలీసు శాఖ నిరంతరం నిఘా పెట్టిందని ఆయన తెలిపారు. అయోధ్యపై సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు వెలువడడానికి వారం రోజుల ముందు నుంచే భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. తీర్పు వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క చిన్న ఘటన కూడా జరగలేదని ఆయన తెలిపారు. అయితే సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు సృష్టించిన 70 మందిని అరెస్టు చేశామని, ఇంకా 270 సోషల్ మీడియా అకౌంట్లపై చర్యలు చేపట్టామని డీజిపీ వివరించారు. రాష్ట్ర అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ సారథ్యంలో 8 పోలీ సు జోన్లు నిరంతరం సోషల్ మీడియా పోస్టింగ్‌ల ను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇంకా ప్రత్యేక నిఘా బృం దాలూ సోషల్ మీడియాను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.