క్రైమ్/లీగల్

సీజేఐ కార్యాలయం ఆర్‌టీఐ పరిధిలోకి వస్తుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 12: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) పరిధిలోకి తీసుకొచ్చే విషయంలో ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం తీర్పు ఇవ్వనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మధ్యాహ్నం రెండు గంటలకు తీర్పు ఇస్తుంది. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో న్యాయమూర్తులు ఎన్‌వీ రమణ, డీవై చంద్రచూడ్, దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నా సభ్యులుగా ఉన్నారు. ఈ తీర్పును ఇవ్వడానికి సంబంధించిన నోటీసును అత్యున్నత న్యాయస్థానం తన అధికారిక వెబ్‌సైట్‌లో మంగళవారం మధ్యాహ్నం పెట్టింది. హైకోర్టు, కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టు సెక్రెటరి జనరల్, దాని కేంద్ర ప్రజాసంబంధాల అధికారి 2010లో దాఖలు చేసిన పిటిషన్లపై అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ సంవత్సరం ఏప్రిల్ నాలుగో తేదీన తీర్పును వాయిదా వేసింది. సీజేఐ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ సవాలు పిటిషన్లపై విచారణను ముగిస్తూ, ఎవరు కూడా ‘అపారదర్శక వ్యవస్థ’ను కోరుకోరని, అయితే, పారదర్శకత పేరిట న్యాయవ్యవస్థను నాశనం చేయజాలరని పేర్కొంది. ‘ఎవరు అంధకారంలో ఉండాలని కోరుకోరు. ఎవరినీ అంధకారంలో ఉంచాలని కోరుకోరు’ అని వ్యాఖ్యానించింది. ‘ప్రశ్న ఏంటంటే ఒక గీత గీయడం. పారదర్శకత పేరిట, మీరు వ్యవస్థను నాశనం చేయజాలరు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఢిల్లీ హైకోర్టు 2010 జనవరి 10వ తేదీన ఇచ్చిన చరిత్రాత్మక తీర్పులో సీజేఐ కార్యాలయం ఆర్‌టీఐ చట్టం పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. న్యాయ వ్యవస్థ స్వతంత్రత అంటే న్యాయమూర్తి విశేషాధికారం కాదని, అతడిపై ఉన్న బాధ్యత అని పేర్కొంది. హైకోర్టు ఇచ్చిన 88 పేజీల తీర్పును అప్పట్లో అప్పటి సీజేఐ కేజీ బాలకృష్ణన్‌కు వ్యక్తిగతంగా ఎదురుదెబ్బగా భావించారు. ఎందుకంటే, ఆయన ఆర్‌టీఐ చట్టం కింద న్యాయమూర్తులకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించడానికి నిరాకరించారు. ఢిల్లీ హైకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఏపీ షా, న్యాయమూర్తులు విక్రమ్‌జిత్ సేన్, ఎస్.మురళీధర్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.