క్రైమ్/లీగల్

కాచిగూడ రైలు ప్రమాదం -- పైలట్‌పై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: కాచిగూడ స్టేషన్‌లో రైళ్లు ఢీకొన్న ఘటనపై దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మంగళవారం ఘటనాస్థలిని పరిశీలించిన అధికారులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని అధికారులు ధ్రువీకరించారు. ఎంఎంటీఎస్ లోకోపైలట్ చంద్రశేఖర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి ప్రధాన కారణమని రైల్వే అధికారులు పేర్కొన్నారు. రైలును నర్లక్ష్యంగా నడిపినందుకు ఐపీసీ సెక్షన్ 337, ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇతరులకు హాని చేసినందుకు సెక్షన్ 338 కింద చంద్రశేఖర్‌పై పలు కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రైలు ఒక ట్రాక్‌పై వెళ్లాల్సి ఉండగా మరో ట్రాక్‌పైకి తీసుకువెళ్లి పైలట్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని అధికారులు తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని పరామర్శించారు. అదే విధంగా కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వైపు వస్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్ కాచిగూడ స్టేషన్‌కు కొద్ది దూరంలో అదే మార్గంలో వస్తున్న కర్నూల్- సికింద్రాబాద్ హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను సోమవారం ఉదయం ఢీకొట్టిన విషయం విదితమే. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో లోకల్ ట్రైన్ కేబిన్‌లో ఇరుక్కుపోయిన ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్‌ను నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) దాదాపు ఎనిమిదిన్నర గంటలపాటు శ్రమించి ఆయన్ను బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాచిగూడలో చోటు చేసుకున్న రైలు ప్రమాదం ఘటనను ఎస్‌సీఆర్ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు.