క్రైమ్/లీగల్

కార్తీక స్నానాలకు వెళ్లి ముగ్గురు యువకుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోహెడ, నవంబర్ 12: సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం వరికోలులోని మోయతుమ్మెద వాగులో కార్తీక పౌర్ణమి స్నానాలకు వెళ్లిన ముగ్గురు యువ కులు మృతి చెందారు. వరికోలుకు చెందిన కంటె నిఖిల్ (18), కూన ప్రశాంత్ (20), పెందోట వరప్రసాద్ (20), మరో నలుగురు మిత్రులతో కలిసి సమీపంలోని మోయతుమ్మెద వాగులో కార్తీక స్నానం చేసేందుకు వెళ్లారు. అయితే వాగులో ఇసుక కోసం తవ్విన గుంతలు ఉండటంతో వాటిలో పడి దుర్మరణం పాలయ్యారు. వీరిలో రామకృష్ణ అనే వ్యక్తికి ఈత రావడంతో ముగ్గురినీ కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. అజయ్ అనే మరో వ్యక్తిని మాత్రం కాపాడారు. ఈ సంఘటనతో పండుగ వేళ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వాగులో విచ్చలవిడిగా ఇసుక తీయడం వల్లే పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రస్తుత వర్షాలకు వాగు పూర్తిగా నీటితో నిండి ఉండడం వలన గమనించని యువకులు దుర్మరణం పాలయ్యారని, ఇసుక గుంతల వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ మృతుల బంధువులు, గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ సందర్శించి మృతుల కుటుంబీకులను ఓదార్చారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వపరంగా వచ్చే సహాయం అందిస్తామని, అలాగే ఔట్‌సోర్సింగ్ కింద మృతుల కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించేందుకు హామీ ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని ఏసీపీ మహేందర్, స్థానిక ఎస్‌ఐ సతీష్ సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులను ఎంపీ బండి సంజయ్ కుమార్ మంగళవారం రాత్రి 8 గంటలకు ఓదార్చారు.

*మృతులు వరప్రసాద్, ప్రశాంత్, నిఖిల్ (ఫైల్ ఫొటోలు)