క్రైమ్/లీగల్

తాత్కాలిక ఉత్తర్వులివ్వలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కాశ్మీర్‌లో అమలైన 370 అధికరణ రద్దు రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. న్యాయమూర్తి ఎన్వీ రమణ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకొంది. దీనిపై తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేస్తే విచారణ పరిష్కారానికి దారి తీస్తుందన్న అభిప్రాయాన్ని ధర్మాసనం వ్యక్తం చేసింది. సంబంధిత పార్టీల వాదోపవాదాలను విన్న అనంతరం అన్నింటినీ ఒకేసారి పరిష్కరిస్తామని స్పష్టం చేసింది. ఈ బెంచ్‌లో న్యాయమూర్తులు ఎస్‌కే కౌల్, ఆర్ సుభాషణ్ రెడ్డి, డీఆర్ గవాయ్, సూర్యకాంత్‌లు ఇతర సభ్యులుగా ఉన్నారు. డిసెంబర్ 10న ఈ అంశానికి సంబంధించిన అన్ని వాదనలు వింటామని కోర్టు స్పష్టం చేసింది. అయితే, తాజాగా దాఖలైన మరో రెండు పిటిషన్లకు సంబంధించి సమాధానం చెప్పాలని కేంద్రాన్ని కోరింది. గతంలో తాజా పిటిషన్లకు సంబంధించి గడువును విధించినప్పటికీ ఈ రెండు పిటిషన్లలో కీలక అంశాలు ఉన్నందున వాటిని చేపట్టినట్లు తెలిపింది. అన్ని పత్రాలను ఉమ్మడిగా చేర్చాలని దీనివల్ల విచారణ త్వరితగతిన ముగిసే అవకాశం ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే నేషనల్ కాన్ఫరెన్స్, జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్, సీపీఎంలు 370 అధికరణ రద్దును సవాలు చేస్తూ పిటిషన్లు వేశాయి.