క్రైమ్/లీగల్

400 ట్రాక్టర్ల ఇసుక పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోరుట్ల రూరల్, ఏప్రిల్ 17: మండలంలోని మాదాపూర్, కల్లూర్ గ్రామ శివారులో అక్రమంగా నిల్వచేసిన దాదాపు 400 ట్రాక్టర్ల ఇసుక కోరుట్ల పోలీస్ రెవెన్యూ ఆధ్వర్యంలో మంగళవారం పట్టుకున్నారు. నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా రవాణా అవుతున్న చోద్యం చూస్తున్న అధికారులు మంగళవారం ఈ ఇసుకను పట్టుకోవడం విశేషం. గ్రామానికి ప్రత్యేక పోలీస్ అధికారి, విఆర్‌ఓలు ఉన్న మండలంలోని మాదాపూర్, కల్లూర్, సర్పరాజ్‌పూర్, ఏఖీన్‌పూర్, నాగులపేట గ్రామాల నుండి యద్ధేచ్ఛగా పట్టణానికి అక్రమంగా ఆసుక రవాణా అవుతున్న అధికారులు స్పందికపోవడం గమనార్హం. వేసవికాలంలో భూగర్భజలాలు అడుగంటుతున్న సమయంలో ఇసుకను రక్షించుకోవడం ఎంతైన ఉందని పెద్దలు కోరుతున్నారు. కాగా ఈ ఇసుక అక్రమ నిలువలను కోరుట్ల తహశీల్దార్ సత్యనారాయణ, కోరుట్ల ఎస్సై రవికుమార్లు సంయుక్తంగా పట్టుకుని త్వరలో విలీనం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇసుక నిల్వల స్వాధీనం
కరీంనగర్ రూరల్: కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని భావుపేట, ఎలగందుల శివారు గ్రామాల్లో అక్రమంగా నిల్వచేసిన ఇసుక న్విలలను మంగళవారం డ్రోన్ కెమెరాల సహాయంతో పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్వాదీనం చేసుకున్న ఇసుక నిల్వలను సిఎస్‌ఎండిసి అధికారులకు అప్పగించామని అన్నారు. స్వాదీనం చేసుకున్న ఇసుకను కాళేశ్వరం ప్రజేక్టు, డబుల్ బెడ్ రూం నిర్మాణాలకు తరలించామని వారు పేర్కొన్నారు. ఇసుక నిల్వల గుర్తింపు కోసం ఇంకా దాడుల కోనసాగుతున్నాయని తెలిపారు. ఈ దాడుల్లో కొత్తపల్లి ఎస్సై, ఇతర విభాగాలకు చేందిన సిబ్బంది తదితరులున్నారు.
పేకాటరాయళ్లకు జైల్‌శిక్ష
మానకొండూర్, ఏప్రిల్ 17: మానకొండూర్ మండల పరిధిలోని అన్నారం గ్రామంలోని మామాడి తోటలోపేకాటశిబిరం నిర్వహిస్తున్నారని స్థానికుల సమాచారం మేరకు పోలీసులు దాడి చేయగా అరెల్లి అనిల్, అరెల్లి రవి, గంజీ శ్రీకాంత్, రోడ్డ రమేష్, సారయ్యను అరెస్టు చేసి వారివద్ద దొరికిన 3100 రూపాయాలను స్వాధీనం చేసుకోని మంగళవారం రిమాండ్‌కు పంపించగా కోర్టులో పేకాటరాయళ్లుకు రెండు రోజులు జైల్ శిక్షతోపాటు 300 రూపాయాల జరిమాన పడిన్నట్లు సిఐ కోటేశ్వర్ మంగళవారం తెలిపారు.
దుండగులను శిక్షించాలని ఎస్సైకి వినతి
గంభీరావుపేట, ఏప్రిల్ 17: అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలని కోరుతూ బీఎస్పీ నాయకులు మంగళవారం గంభీరావుపేట ఎస్సై లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందచేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రగుడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ బీఎస్పీ మండల శాఖ అధ్యక్షుడు కర్రోల్ల రాజు ఆధ్వర్యంలో ఎస్సైకి వినతిపత్రం సమర్పించారు. ఇలాంటి సంఘటనలు ఇకముందు పునరావృత్తం కాకుండా సంఘటనకు పాల్పడిన దోషులను కఠీనంగా శిక్షించాలని వినతిపత్రంలో డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు ఉపేంద్ర, బరుకుటం వినోద్‌కుమార్, టేకుమల్ల రమేశ్, పెద్దనోల్ల రాజు, చంద్రం, గాదం రాములుతో పాటు పలువురు పాల్గొన్నారు.