క్రైమ్/లీగల్

ముగ్గురు కొడుకులతో సహా తండ్రి ఆత్మహత్యా యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ పోలీస్‌స్టేషన్ ఎదుట తండ్రీ, ముగ్గురు కొడుకులు పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ సంఘటన జిల్లాలో కలకలం రేపింది. భూ సమస్య పరిష్కారం కావడం లేదనేది ఒకవైపు, మరో వైపు పోలీసులు తరచూ స్టేషన్‌కు పిలిపించి వేధింపులకు గురిచేస్తున్నారని, దీంతో మనస్థాపానికి గురై పోలీసుస్టేషన్ ఎదుటే ఉన్న ఫర్టిలైజర్ షాపులో పురుగుల మందు కొనుగోలు చేసి అక్కడే తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు, స్థానికులు గమనించి వారిని వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలం కర్ణమామిడికి చెందిన రైతు కొట్టె వీరయ్యకు చెందిన భూమిలో నుండి ఆర్ అండ్ ఆర్ కాలనీ డ్రైనేజీ నీరు వస్తుందని వాటిని మళ్లించాలని, 100 రోజుల ప్రణాళికలో భాగంగా అప్పటి పంచాయతీ కార్యదర్శి చంద్రకళకు విన్నవించినప్పటికీ పట్టించుకోకుండా తన పొలంలోకే పంపించారని, ఈ వివాదంపై హాజీపూర్ పోలీసుస్టేషన్‌లో తమపై ఫిర్యాదు చేసినట్టు బాధితులు పేర్కొన్నారు. అధికారులు, పోలీసులు తమపై కక్ష కట్టి తమను పలుమార్లు పోలీసుస్టేషన్‌కు పిలిపించి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ అండ్ ఆర్ కాలనీ డ్రైనేజీ వాటర్ తన పొలంలోకి రావద్దని అభ్యంతరం వ్యక్తం చేయడంతో తనపై కేసులు పెడుతున్నారని, పోలీసులు అధికారులకే మద్దతు పలుకుతూ, డ్రైనేజీ సమస్య పరిష్కార విషయంలో ఎంతమాత్రం సహకరించడం లేదని అన్నారు. పోలీసు స్టేషన్‌కు పిలిపించి రౌడీ షీట్ తెరుస్తామని బెదిరించడంతో తీవ్ర మనస్థాపం చెందిన వీరయ్య, తన కుమారులతో కలసి పోలీసు స్టేషన్ ఎదురుగా క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు బాధితులు పేర్కొన్నారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కాగా, వీరయ్యపై ఇప్పటికే ఎన్నో కేసులు నమోదు కాగా, ప్రస్తుతం రౌడీ షీటు నమోదు చేస్తామని అనడంతో కేసు నుంచి తప్పించుకునేందుకే పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడని హాజీపూర్ ఎస్సై చంద్రవౌళి పేర్కొన్నారు. డ్రైనేజీ తగాదా విషయంలో గతంలో ఫిర్యాదు వచ్చిందని, అదేవిధంగా అధికారులకు సహకరించడం లేదని, వాస్తవాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. వీరయ్య అతని కుమారులు ప్రస్తుతం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో కోలుకుంటున్నారని తెలిపారు.