క్రైమ్/లీగల్

జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల: జీడిమెట్ల పారిశ్రామికవాడలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తుప్పు పట్టిన మిషనరీ, నాణ్యత లోపం, ఏర్ పొల్యూషన్, రెండుసార్లు సీజ్ చేసినా తిరిగి పునఃప్రారంభం వెరసి ఇద్దరు కార్మికుల ప్రాణాలను జీవిక పరిశ్రమ పొట్టన పొట్టుకుంది. వివరాల్లోకి వెళితే.. నగర శివారు ప్రాంతంలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల పారిశ్రామికవాడలోని జీవిక లైఫ్ సైనె్సస్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమలో సోమవారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పరిశ్రమలో పనిచేస్తుండగా ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో దట్టమైన రసాయనిక పొగలతో ఏదో జరిగిందనే భయంతో ప్రక్కనే గల పరిశ్రమల కార్మికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దట్టమైన పొగలు వెలువడడంతో అగ్నిమాపక సిబ్బంది లోనికి వెళ్లేందుకు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. మాస్కులు ధరించి లోపలికి వెళ్లి కార్మికులను రక్షించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో బీహార్ రాష్ట్రానికి చెందిన అన్వర్, అంబరీష్ తీవ్ర గాయాలకు గురయ్యారు. పేలుడు ధాటికి చిక్కుకున్న కార్మికులను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు రక్షించారు. అయితే తీవ్ర గాయాలకు గురైన అన్వర్, అంబరీష్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. కాగా పేలిన ఘటన వద్ద గాయాలకు గురైన నలుగురు కార్మికులు ఘటనా స్థలం వద్దనుండి వెళ్లిపోయారు. భారీ పేలుడుతో ప్రక్కనే ఉన్న పరిశ్రమలలో, రోడ్లపై రేకులు తునకాతునకలై పడ్డాయి. పలు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. భారీ పేలుడుకి పరిశ్రమ పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. జీడిమెట్ల పారిశ్రామికవాడ మొత్తం దట్టమైన రసాయన పొగలు వ్యాపించడంతో స్థానికులు కళ్ల మంటలు, శ్వాసకోశ ఇబ్బందులతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తరచు కెమికల్ పరిశ్రమలలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రసాయనిక పరిశ్రమలను ఆవాసాలకు దూరంగా తరలించాలని ప్రజలు కోరుతున్నారు.
తుప్పుపట్టిన మిషనరీ, నాణ్యత లోపం, ఏర్ పొల్యూషన్స్, పీసీబీ వారి హెచ్చరికలు, గతంలో పరిశ్రమను రెండుసార్లు సీజ్ చేసినా పైరవీలతో తిరిగి పునఃప్రారంభం కావడం వెరసి ఇద్దరు కార్మికుల ప్రాణాలను బలిగొంది. రెండుమార్లు జీవిక పరిశ్రమ మూతపడ్డా మళ్లీ పైరవీలతో నిర్వాహకులు తెరవడం కార్మికుల పాలిటశాపంగా మారింది.