క్రైమ్/లీగల్

బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 18: బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై నేరం రుజువు కావడంతో ఏడాది జైలుశిక్ష, వంద రూపాయల జరిమానా విధిస్తూ పోక్సో స్పెషల్ కోర్టు తీర్పుచెప్పింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. కొత్తపేట నెహ్రూ బొమ్మ సెంటర్‌కు చెందిన జామిని కిరణ్‌రెడ్డి(20) అనే వ్యక్తి చిట్టినగర్ ప్రైజర్‌పేటకు చెందిన తొమ్మిదో తరగతి బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. 2018 అక్టోబర్ 29న తనను పెళ్లి చేసుకోమని, లేకపోతే చనిపోతానని బ్లేడుతో తన చేతిని గాయపరుచుకుని బెదిరించాడు. దీంతో బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన వన్‌టౌన్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో ప్రాసిక్యూషన్ తరపున పోలీసులు ప్రవేశపెట్టిన ఏడుగురు సాక్షులను విచారించారు. నిందితునిపై నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పుచెప్పారు.