క్రైమ్/లీగల్

వచ్చేనెల 2న లాలూను కోర్టుకు తీసుకురండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, నవంబర్ 19: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు కోర్టు చిక్కులు తప్పడం లేదు. దాణా కుంభకోణం కేసులో రాంచీ జైలులోశిక్ష అనుభవిస్తున్న లాలూకు ఓ పరువునష్టం కేసులో పాట్నా ప్రత్యేక కోర్టు ప్రొడక్షన్ వారెంట్ జారీ చేసింది. బిహార్ రాష్ట్ర విపత్తుల నివారణ అథారిటీ సభ్యుడు ఉదయ్ కాంత్ మిశ్రా ఆర్జేడీ చీఫ్‌పై పరువునష్టం దావా వేశారు. మిశ్రా పిటిషన్‌ను విచారించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కుమార్ అభినవ్ బిహార్ మాజీ సీఎం లాలూకు వారెంట్ జారీ చేసింది. లాలూ తనపై అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేశారని పిటిషనర్ ఆరోపించారు. 2019, డిసెంబర్ 2న లాలూను కోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఆర్జేడీ అధినేత ప్రస్తుతం రాంచీలోని బిస్రాముండా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. వచ్చే వాయిదా నాటికి ఆయను ప్రత్యేక కోర్టులో హాజరుపరచాలని కోర్టు స్పష్టం చేసినట్టు మిశ్రా తరఫున్యాయవాది వీఎస్ దూబే వెల్లడించారు. కోట్లాది రూపాయల దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన లాలూను కట్టుదిట్టమైన భద్రత మధ్య బిస్రాముండా జైలులో ఉంచారు. ఆయనను వీడియో కాన్ఫరెన్స్ విచారణకు గైర్హాజరైనందున డిసెంబర్ 2న వ్యక్తిగతం కోర్టుకు రావాలని జడ్జి ఆదేశించారు. ఈమేరకు బిస్రాముండా జైలు అధికారులకు స్పష్టం చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి బాగాలేనందున వీడియోకాన్ఫరెన్స్‌కు తీసుకురాలేకపోయామని జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. 2017లోవ భాగల్పూర్‌లో జరిగిన ఓ సభలో లాలూ ఆయన కుమారుడు తేజస్వీ శ్రీజన్ కుంభకోణంపై మాట్లాడుతూ ఉదయ్‌కాంత్ మిశ్రాపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులను భాగల్పూర్‌లోని ఓ స్వచ్ఛంద సంస్థకు అక్రమ మార్గాల ద్వారా బదిలీ చేశారు. అదే శ్రీజన్ కుంభకోణం. దీనిపై సీబీఐ విచారణ జరిగింది. మహిళల కోసం శ్రీజన్ అనే సంస్థ నమోదైంది. అల్పాదాయ మహిళల కోసం పనిచేసే ఈ స్వచ్ఛంద సంస్థలో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయి.
ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ భాగల్పూర్ ఎప్పుడు వెళ్లినా మిశ్రా ఇంటికి సందర్శించేవారని ఆర్జేడీ నేతలు ఆరోపించారు. పరువునష్టం జరిగిందిన తొలుత తండ్రీ కొడుకులకు మిశ్రా లీగల్ నోటీసులు ఇచ్చారని న్యాయవాది దూబే వెల్లడించారు.