క్రైమ్/లీగల్

కాల్వలోకి దూసుకెళ్లిన కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉయ్యూరు, నవంబర్ 19: మండలంలోని కలవపాముల గ్రామం వద్ద సోమవారం అర్ధరాత్రి జరిగిన కారు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా నలుగురికి గాయాలైనాయి. రూరల్ పోలీసుల కథనం ప్రకారం గుడివాడ గ్రామానికి చెందిన ఓ కుటుంబం కార్తీకనోముల నిమిత్తం గన్నవరం వెళ్ళి తిరిగి వస్తుండగా కలవపాముల గ్రామం వద్దకు వచ్చే సరికి కారు అదుపుతప్పి ప్రక్కనే ఉన్న కాల్వలోకి దూసుకు వెళ్ళింది. కాల్వలో నీరు నిండుగా ఉండటంతో కారులో ఉన్న గౌరీకుమారి (60) నీరు త్రాగి ఊపిరందక మృతి చెందింది. అర్ధరాత్రి కావడంతో ఆ ప్రాంతం నిర్మానుష్యంగా ఉండటంతో కారులోని వారిని కాపాడేందుకు కొంత సమయం పట్టింది. వెనుకగా వస్తున్న వాహనదారులు పరిస్థితి గమనించి గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో వారు కారును వెలికి తీసి మిగిలిన నలుగురిని కాపాడారు. సమాచారాన్ని ఉయ్యూరు రూరల్ పోలీసులకు అందించడంతో వారు రంగప్రవేశం చేసి, కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని, క్షతగాత్రులను ఉయ్యూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.