క్రైమ్/లీగల్

రెవెన్యూ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దంతాలపల్లి, నవంబర్ 19: మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలపరిధిలోని కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన ఐనాల శంకర్ తన భూమికి పాస్‌పుస్తకం రాలేదని మంగళవారం మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎస్సై బానోత్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్మరికుట్ల గ్రామానికి చెందిన ఐనాల శంకర్ 2012లో అదేగ్రామానికి చెందిన తండ విష్ణు వద్ద 8 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. కొనుగోలుచేసిన సర్వే నెంబర్ 21ఎ భూమిని తన పేరుమీద రిజిస్ట్రేషన్ చేసుకునేలోపే భూమిని విక్రయించిన విష్ణు అకాలమరణం చెందాడు. దీంతో విష్ణు భార్య తండ సరిత తన పేరుమీద పట్టాదారు పాస్‌పుస్తకం చేయించుకుంది. విషయం తెలిసి ఆగ్రహించిన ఐనాల శంకర్ దంతాలపల్లి రెవెన్యూ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని తనకు పట్టా ఇవ్వాలని లేనిపక్షంలో నిప్పు అంటించుకుంటానని బెదిరించాడు. విషయం తెలుసుకున్న ఎస్సై తహశీల్దారుతో కలసి అక్కడకు చేరుకొని వారి సమస్యను మూడు రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈసందర్భంగా బాధితుడు శంకర్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తామని చెప్పారే తప్పా నేటికి ఎవరికి అందడంలేదని ఆరోపించాడు. ఇప్పటికైనా నిరుపేదలకు భూమి హక్కుపత్రాలను అందజేయాలని వారు కోరాడు.

*చిత్రం...పెట్రోల్ బాటిల్‌తో ఆత్మహత్యాయత్నం చేస్తున్న శంకర్