క్రైమ్/లీగల్

జీఎస్‌టీ తెచ్చిన తంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఔరంగాబాద్, నవంబర్ 20: జీఎస్‌టీ ఓ వ్యాపారి ప్రాణాన్ని మింగేసింది. వాలుజ్ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ చిన్న మెటల్ పాలిషింగ్ యూనిట్‌ను నడుపుతున్న ఓ ఔత్సాహిక పారిశ్రామికవేత్త వస్తు అమ్మకం పన్ను (జీఎస్‌టీ) చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. పండర్‌పూర్ ప్రాంతంలో నివసిస్తున్న విష్ణు రాంబావు కలవనె (53) మంగళవారం తన నివాసంలో ఫ్యానుకు చీరతో ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
జీఎస్‌టీ చెల్లించాలన్న వత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు విష్ణు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రాసిన లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎంఐడీసి వాలుజ్ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ గయక్‌వాడ్ తెలిపారు.