క్రైమ్/లీగల్

టాలీవుడ్‌పై ఐటీ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు బుధవారం సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల ఇళ్ళపై ఆకస్మికంగా దాడులు చేశారు. దీంతో సినీ పరిశ్రమకు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాగా, సినిమాలకు సంబంధించిన నిర్మాణ వ్యయాలు, వార్షిక ఆదాయాల లెక్కల్లో భారీ అవకతవకలు జరిగినట్లు ఐటీ అధికారుల దృష్టికి వచ్చింది. ఈ దాడుల్లో ఐటీ రిటర్నకు సంబంధించిన పత్రాలు, హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. పన్ను ఎగవేతకు సంబంధించి అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలను రామానాయుడు స్టూడియోస్ తరఫున నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు పెద్దఎత్తున పంపిణీ చేస్తున్నారు. ఐటీ అధికారుల సోదాల్లో ఈ అంశం కూడా కీలకమైంది. కొద్ది రోజుల క్రితం మైత్రీ మూవీ మేకర్స్, దిల్‌రాజు, కెఎల్ నారాయణ నివాసాల్లో సోదాలు జరిగాయి. టాలీవుడ్ వర్గాల్లో ఈ సోదాలు తీవ్ర కలకలం సృష్టించాయి. కొత్త సినిమాలు నిర్మించిన ప్రొడక్షన్ కార్యాలయాల్లో సోదాలు కొనసాగాయి. సురేశ్ బాబు ఇళ్లు, కార్యాలయాలతో పాటు రామానాయుడు స్టుడియోలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో పలుచోట్ల దాటులు చేయడం చర్చనీయాంశమైంది. ఆగ్రహీరోల ఆడిటర్లను దగ్గర ఉంచుకుని, వారి ఇళ్లపై ఐటీ అధికారులు సోదాలు చేపట్టడం పట్ల సినిమా పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందాయి. బుధవారం ఉదయం నుంచి ప్రముఖ
నిర్మాత రామానాయుడు స్టుడియోతో పాటు ఆయన కుటుంబీకుల కార్యాలయాలతో పాటు వారి ఇళ్లల్లో ఐటీ అధికారులు ఆకస్మిక సోదాలు జరిపారు. దాదాపు హీరోల అందరి ఇళ్లపై సోదాలు చేశారు. ఈ దాడుల్లో విలువైన దస్తావేజీలు, హార్డ్‌డిస్క్‌లు లభించడంతో అందులో ఎలాంటి సమాచారం ఉందోనని టాలీవుడ్ వర్గాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి. అక్కినేని నాగార్జున, వెంకటేష్, నానీ, అల్లు అర్జున్‌తోపాటు ప్రముఖ సినీ నిర్మాణ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సినిమాస్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగాయి. అగ్ర సినిమాల డైరెక్టర్ల ఇళ్లపై కూడా ఐటీ దాడులు జరిగాయి. కాగా, అధికార పార్టీ తెరాస కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణరావు ఇంటిపై కూడా ఐటీ అధికారులు దాడులు చేశారు. ప్రణీత గ్రూప్ ఎండీ సురేందర్‌తో పాటు ఐదుగురు డైరెక్టర్ల నివాసాల్లో సోదాలు జరిగాయి. ఎమ్మెల్యే కుమారుడు సందీప్‌రావు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న అభియోగాలపై ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఐటీ సోదాలపై మీడియా హడావుడి చేయాల్సిన అవసరం లేదని, ఇవన్నీ సాధారణంగా జరిగే తనిఖీలేనని టాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.